AP Corona Cases: ఆంధ్ర‌ప్రదేశ్‌లో కొత్తగా 6,952 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా

ఆంధ్ర‌ప్రదేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతుంది. కొత్తగా 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 1,08,616 మందికి కరోనా పరీక్షలు చేయ‌గా 6,952 కేసులు...

AP Corona Cases: ఆంధ్ర‌ప్రదేశ్‌లో కొత్తగా 6,952 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా
Ap Corona
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 12, 2021 | 4:58 PM

ఆంధ్ర‌ప్రదేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతుంది. కొత్తగా 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 1,08,616 మందికి కరోనా పరీక్షలు చేయ‌గా 6,952 కేసులు న‌మోద‌య్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,03,074 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. మ‌రో 58 మంది వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఫ‌లితంగా రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,882కి చేరింది. కొత్త‌గా కరోనా నుంచి మరో 11,577 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 16,99,775 మంది బాధితులు కొలుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.  ప్రస్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా 91,417 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,03,48,106 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,199 కేసులు, అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 228 కేసులు వెలుగుచూశాయి. కొత్త‌గా  కరోనాతో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 మంది మృతి చెందారు. అనంతపురం, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృత్యువాతపడ్డారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..

Ap Corona

ఇండియాలో త‌గ్గుతున్న క‌రోనా వ్యాప్తి

ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్లు, ఆంక్షల ఫలితాలు క‌నిపిస్తున్నాయి. దేశంలో క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్టింది. శుక్రవారం 19,20,477 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 84,332 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. వరుసగా ఐదోరోజూ లక్ష దిగువనే కేసులు నమోదయ్యాయి. 90 వేల దిగువకు కేసులు నమోదు కావడం ఈ నెలలో ఇది సెకండ్ టైమ్. 24 గంటల వ్యవధిలో మరో 4,002 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 2,93,59,155కి చేరగా.. 3,67,081 మంది బలయ్యారు.

Also Read: అడ‌వి బిడ్డ‌లు.. స్మశానాన్ని ఐసోలేషన్ సెంట‌ర్‌గా మార్చుకున్నారు.. .అధికారులు వద్దంటున్నా

ఇన్ని పండ్లు ఒకే చోట‌.. పండుగే పండుగ.. ఏనుగు ఎంజాయ్ చేస్తూ ఎలా తినిందో చూడండి