AP Corona: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా ఎంత మందికి వైరస్ సోకిందంటే..?
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,088 సాంపిల్స్ పరీక్షించగా.. 1,535 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొత్తగా 20 మంది మృతి.

AP Covid 19 Positive Cases: ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,088 సాంపిల్స్ పరీక్షించగా.. 1,535 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొత్తగా గడిచిన 24గంటల్లో మరో 20 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలను కోల్పోయారు. ఇక, గడిచిన 24 గంటల సమయంలో 2,075 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,19,92,191కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 1,19,60,350కి చేరింది.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 13,631 మంది మృతి చెందితే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 18,210 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. నేటి వరకు 2,55,95,949 సాంపిల్స్ పరీక్షించామని బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.
ఇక, కోవిడ్ మహమ్మారి దాటికి గడిచిన 24 గంటల వ్యవధిలో చిత్తూర్ జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఒక్కరు, కడప, విశాఖపట్నం జిల్లాలో ఒక్క రు మరణించారు.
ఇక, జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి….

Read Also…. NHRC: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్‌హెచ్చార్సీ ఆగ్రహం
