AP Corona Cases: ఏపీలో కొత్త గుబలు.. ఇవాళ కాస్త పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. ఎంతంటే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసలు కాస్త పెరిగాయి. తాజాగా, రాష్ట్రంలో కొత్త కేసులు 2600కుపైగా నమోదయ్యాయి.

Andhra Pradesh Reports Covid19 Positive Cases: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసలు కాస్త పెరిగాయి. తాజాగా, రాష్ట్రంలో కొత్త కేసులు 2600కుపైగా నమోదయ్యాయి. రాష్ట్రంలో 91,594 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 2,672 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,672 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ ప్రభావంతో 18 మంది ప్రాణాలొదిలారు. తాజాగా 2,467 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,98,966 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి మొత్తం 13,115 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,041 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 2,34,88,031 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఇక జిల్లాల వారీగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల వివరాల ఇలా ఉన్నాయి…

Ap Corona Cases Today
Read Also…
యూట్యూబ్ ఛానెల్‌లో అశ్లీల కంటెంట్.. ప్రముఖ సింగర్‌కు వేధింపులు.. వ్యక్తి అరెస్ట్..
