AP Covid 19: ఏపీ కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు.. ఒక్కరోజులో గణనీయంగా తగ్గిన కేసులు.. పెరిగిన మరణాలు..!
AP Corona Cases Today: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.
AP Corona Cases Today: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే, మృతుల సంఖ్య అనుహ్యంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 49,581 కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే వారిలో 1,145మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. కరోనాతో మరో 17మృతి ప్రాణాలను కోల్పోయారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 216, నెల్లూరు జిల్లాలో 173 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఇక, శుక్రవారం ఒక్కరోజే కరోనా వైరస్ బారి నుంచి 1,090మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకుకున్నవారి సంఖ్య 19,99,651కు చేరుకుంది.
ఇక, గడిచిన 24గంటల వ్యవధిలో కరోనాతో 17 మృతి ప్రాణాలను కోల్పోయారు. చిత్తూర్ జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 15,157యాక్టివ్ కేసులున్నట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.
ఇక, జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి…