TS Corona: తెలంగాణలో మళ్లీ కరోనా కలవరం.. విద్యాసంస్థల్లో వెలుగుచూస్తున్న కేసులు.. రాష్ట్రంలో ఇవాళ కొత్త కేసులు ఎన్నంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 69,833 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 296 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Telangana Coronavirus: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 69,833 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 296 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడినవారి సంఖ్య 6,61,302కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 3,893కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 322 మంది కోలుకున్నారు. ఇక, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,52,085కు చేరుకుంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 5,324 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 98.60 శాతానికి చేరిందని అధికారులు తెలిపారు.
మరోవైపు, పలు జిల్లాల్లోని పాఠశాలల్లో కరోనా వైరస్ విజృంభిస్తూ కలవర పెడుతుంది. వివిధ జిల్లాల్లోని స్కూల్స్ లో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ వైరస్ వ్యాప్తితో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎలాంటి భయమూ వద్దని ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నా కరోనా తన పని తాను చేసుకుని పోతుంది. తాజాగా నల్గొండ జిల్లాలోని సెయింట్ ఆల్ఫోన్సెస్ హైస్కూల్‌లో కరోనా కలకలం రేపింది. హైస్కూల్ ప్రిన్సిపాల్ జార్జ్ జోసఫ్ సహా మరో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ప్రిన్సిపాల్ జార్జ్ జోసఫ్ చికిత్సపొందుతూ మృతి చెందినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యార్థుల పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వైరస్ సోకిన వారిని ప్రత్యేకంగా ఉంచి వైద్యం అందిస్తున్నారు.
ఇక, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. కాలేజీలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మిగితా వారికి కరోనా పరీక్షలు చేస్తున్నారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated.11.09.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/eGPKEumyKJ
— IPRDepartment (@IPRTelangana) September 11, 2021