Golden Hour: అతివేగం ప్రమాదకరం.. హెల్మెట్‌ ధరిస్తే ప్రాణం పదిలం.. ప్రమాదాల్లో ‘గోల్డెన్ అవర్’ చాలా కీలకం.. ఎందుకో తెలుసా?

Golden Hour is Road Accident: ఎవరైనా ప్రమాద బారినపడినప్పుడు వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. ఎందుకంటే ఈ మొదటి గంటల ప్రాణాల్ని నిలపెట్టే జీవగంట..

Golden Hour: అతివేగం ప్రమాదకరం.. హెల్మెట్‌ ధరిస్తే ప్రాణం పదిలం.. ప్రమాదాల్లో ‘గోల్డెన్ అవర్’ చాలా కీలకం.. ఎందుకో తెలుసా?
Golden Hour In Accident

Golden hour Importantancy:  ఎవరైనా ప్రమాద బారినపడినప్పుడు మనకేంటని వదిలేయకుండా.. వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. ఎందుకంటే ఈ మొదటి గంటల ప్రాణాల్ని నిలపెట్టే జీవగంట.. యాదృచ్చికమే కావచ్చు. కానీ, ఈ గోల్డెన్‌ అవర్‌ రియల్‌ లైఫ్‌లో హీరో సాయి ధర్మ్‌ తేజ్‌ను రిస్క్‌ నుంచి కాపాడింది. ఎక్కడైనా సరే ఎవరికైనా సరే యాక్సిడెంట్‌ జరిగినప్పుడు వన్‌ డబుల్‌ జీరో..108కు కాల్‌ చేసేవాళ్లు.. రియల్‌ హీరోస్‌ అని చెప్పొచ్చు. అలాగే, అందిన సమాచారమే మేరకు వెంటనే స్పందించి స్పాట్‌కు చేరుకునే పోలీసులు.. 108 సిబ్బంది సైతం రియల్‌ హీరోస్.. క్షతగాత్రులను జెట్‌స్పీడ్‌తో హాస్పిటల్‌కు తరిలించే 108 డ్రైవర్స్‌ రియల్‌ హీరోస్‌.

క్షణకాలం ఆలస్యం చేయకుండా సత్వర చికిత్సతో పేషెంట్‌ ప్రాణాలను నిలిపే వైద్యులే బ్రహ్మ విష్ణు మహేశ్వర సమానులంటారు. చెప్పడానికి ఇంత. కానీ ఇదంతా చకచకా గంటలోపు జరిగితే.. అదే గోల్డెన్‌ అవర్‌. స్నేహశీలి, ఎందరికీ ఆత్మీయుడు, వర్ధమాన నటుడు సాయిధరమ్‌ తేజకు గోల్డెన్‌ అవరే పునర్జన్మనిచ్చిందనడంలో ఎలాంటి సందేశం లేదు.. హైదరాబాద్‌లో మాదాపూర్ ప్రాంతంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌ నుంచి ఐకియా వైపు వస్తుండగా స్పోర్ట్స్‌ బైక్‌ స్కిడై గాయపడిన సాయి ధర్మ్‌ తేజ్‌ను సకాలంలో మెడికవర్‌ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, అప్పటికే అతనికి ఫిట్స్‌ రావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లారు. 108 సిబ్బంది సకాలంలో మెడికవర్‌కు తరలించడంతో గోల్డెన్‌ అవర్‌ గండాన్ని గట్టెక్కించింది. ఇప్పుడు వీరే సాయిధర్మ తేజ్‌కు మరో ప్రాణం ఇచ్చినవారిలో దేవుళ్లయ్యారు.

యాక్సిడెంట్‌ స్పాట్‌లో వున్న వున్న వాళ్లు రైట్‌ టైమ్‌లో స్పందించి 100,108కు ఫోన్‌ చేయడం… రైట్‌ చాయిస్‌గా మెడికవర్‌ హాస్పిటల్‌కు తరలించడం….రైట్‌ హెల్మెట్‌ ధరించడం…. హీరో సాయిధర్మ్‌ తేజ్‌కు రక్షణ కవచంగా నిలిచాయి. సాయిధర్మ్‌ తేజ్‌ ఔటాఫ్‌ డేంజర్‌. ప్రస్తుతం ఆయన సేఫ్‌ హ్యాండ్‌ ఆపోలో హాస్పిటల్‌లో మెరుగైన వైద్యంతో కోలుకుంటున్నారు. టీమ్‌ ఆఫ్‌ డాక్టర్స్‌ మినట్‌ టు మినట్‌ ఆయన హెల్త్‌ కండీషన్‌ను మానిటర్‌ చేస్తున్నారు. సాయిధరమ్‌ తేజ్‌కు కంటిపైన..చాతిలో..పొట్ట మీద గాయాలయ్యాయి. స్కానింగ్‌లో క్లావికల్‌ ఫ్రాక్చర్‌ జరిగినట్టు గుర్తించారు. ఐతే బ్రెయిన్‌ సహా మేయిన్‌ ఆర్గాన్స్‌ ఫంక్షనింగ్‌ నార్మల్‌గా వుందన్నారు. సాయిధర్మ్‌ తేజ్‌ కోలుకుంటున్నారని.. ప్రస్తుతం మెడికల్‌ అబ్జర్వేషన్‌లో ఉన్నారని వైద్యులు తెలిపారు. రోడ్‌ యాక్సిడెంట్‌లో కావికల్‌ ప్రాక్చరే కామనేని.. ఆందోళన పడాల్సిన అవసరంలేదన్నారు.

యాక్సిడెంట్‌ జరిగిన టైమ్‌లోనే సాయి ధర్మ్‌ తేజ్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అది షాక్‌ వల్ల.. అంతకు మించి ఆందోళనకరమైన పరిస్థితులేవీ లేవని కుటుంబసభ్యులు, డాక్టర్లు మొదటి నుంచి క్లారిటీ ఇచ్చారు. అయితే, మెగా అభిమానుల్లో మాత్రం కొంత ఆందోళన నెలకొంది. గాయాలు చిన్నవైతే వెంటిలేటర్‌పై చికిత్స అందిండచం ఏంటి? ఇన్ని గంటలైనా తేజ్‌ ఎందుకని స్పహాలోకి రాలేదు?. ఏదైనా న్యూ రో ప్రాబ్లమ్‌ వుందా? లేక ఇంటర్నల్‌గా మరేవైనా గాయాలున్నాయా? ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ సాయిధర్మ్‌ తేజ్‌కు ట్రీట్మెంట్‌ అందిస్తోన్న టీమ్‌ ఆఫ్‌ డాక్టర్స్ మాత్రం ఆల్‌ ఈజ్‌ వెల్‌ అంటున్నారు. గోల్డెన్‌ అవరే సాయిధర్మ్‌ తేజ్‌కు శ్రీరామరక్షగా నిలిచిందన్నారు. ఎస్‌.. సాయిధర్మ్‌ తేజ్‌ కోలుకుంటున్నారు. వైద్యానికి స్పందిస్తున్నారు. మరో 24 గంటల్లో ఆయన మాట్లాడుతారని.. మళ్లీ నార్మల్‌ లైఫ్‌ లీడ్‌ చేస్తారనేది డాక్టర్స్‌ మాట.

ప్రకాశ్‌రాజ్‌ చెప్పినట్టు ఫైటింగ్‌ స్పిరిట్‌ వున్న సాయి ధర్మ్‌ తేజ్‌ విన్నర్‌గా ఫ్యాన్స్‌ను పలకరిస్తారని ఆశిద్దాం. గుర్తుంచుకోండి.. గోల్డెన్‌ అవర్‌ ఎంత గొప్పదో. ఎక్కడైనా ప్రమాదం జరిగితే బాధ్యతగా..మానవీయంగా స్పందించాలి. అతివేగం ప్రమాదకరం. సరైన హెల్మట్‌ ధరించడం ముఖ్యం.

Read Also…  AP Fiber Grid: ఫైబర్‌ గ్రిడ్‌ స్కామ్‌లో తీగ లాగితే డొంక కదులుతోంది.. సీఐడీ విచారణలో వెలుగులోకి కొత్త పేర్లు!

Click on your DTH Provider to Add TV9 Telugu