Easy Kitchen Tips: నేటి వనితల కోసం నాటి మహిళలు చెప్పిన ఈజీ టిప్స్.. ఇలా చేస్తే.. అరగంట పట్టే పని క్షణాల్లో కంప్లీట్..
Easy Kitchen Tips: మహిళలు వంటింటి మహారాణులు.. దేశాన్ని ఏలే అధినేత అయినా ఒక ఇంటికి ఇల్లాలే.. తన కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకోవడం.. భాద్యతగా ఉండడం.. ప్రతి మహిళలు ఇష్టమే.. అయితే అన్ని రంగాల్లో ముందు..

Easy Kitchen Tips: మహిళలు వంటింటి మహారాణులు.. దేశాన్ని ఏలే అధినేత అయినా ఒక ఇంటికి ఇల్లాలే.. తన కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకోవడం.. భాద్యతగా ఉండడం.. ప్రతి మహిళలు ఇష్టమే.. అయితే అన్ని రంగాల్లో ముందు ఉండే నేటి మహిళలకు ఓ వైపు ఇంట్లో పని.. మరోవైపు విధి నిర్వహణ.. దీంతో సమయం ఆదా చేసుకోవడానికి ప్రతి మహిళ ఆసక్తిని చూపిస్తుంది. ఎంత బిజీగా ఉన్నా సరే తన వారి కోసం స్వయంగా వండి పెట్టడం ఇష్టపడుతుంది. అయితే అరగంట పట్టే పనులు.. క్షణాల్లో ఐతే చాలు అనుకుంటారు. అయితే కొన్ని పనులు అనుకున్నట్లు జరగవు.. కూరల్లో ఉప్పు కారం ఎక్కువకావడం.. మాంసం గట్టిపడడం..ఉల్లిపాయలు కొస్తే కంటి నీరు రావడం.. పచ్చిమిర్చి కట్ చేస్తే చేతులు మండడం వంటి అనేక సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలతో మీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.. ఈ అద్భుతమైన టిప్స్ పరిష్కారం చూపించడమే కాదు.. మీ సమయాన్ని ఆదా చేస్తాయి కూడా..
*పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత కొందరికి చేతులు విపరీతంగా మండుతాయి.. అటువంటి వారు పంచదార చేతులకు రుద్దుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. *ఉల్లిపాయలను కట్ చేసేటప్పుడు కళ్ళ నుంచి నీరు వస్తుంది.. కళ్ళు మండుతాయి.. అందుకని ఉల్లిపాయలు కట్ చేసే ముందు వాటిని వాటిని కొంచెం సేపు చల్లని నీటిలో ఉంచాలి.. లేదా.. కాసేపు వాటిని ఫ్రీజర్‌లో ఉంచితే సరిపోతుంది. *పచ్చిమిరపకాయల్ని కాసింత పసుపుతో చేర్చి సీసాలో నిలువ చేస్తే ఎరుపు రంగుకు మారకుండా ఉంటాయి. *ఉల్లిపాయలు కట్ చేసిన అనంతరం చేతులు ఉల్లి వాసన రావడం సహజం.. తాజా నిమ్మరసం చేతులకు పట్టిస్తే ఉల్లి వాసన తొలగిపోతుంది. *చీమలు ఇంట్లో ఇబ్బంది పెడుతుంటే.. మిరియాల పొడి వేస్తే .. చీమలు దరిచేరవు. *అప్పుడప్పుడు ఉప్పు షేకర్‌లోని ఉప్పు ముద్దలుగా మారి బయటికి సరిగా రాదు. అలాంటప్పుడు దానిలో కొన్ని బియ్యం గింజలు వేస్తే ఉప్పు సులభంగా బయటికి వస్తుంది. *మాంసాన్ని వేయించేటప్పుడు అది బంగారు గోధుమ రంగులోకి వస్తే మంచి లుక్ ఉంటుందని అందరూ కోరుకుంటారు. అయితే మాంసంపై మిరపకాయ ముక్కలను చల్లితే చాలు. *అన్నం పొడి గా ఉంటె చాలా మందికి ఇష్టం.. అటువంటివారు ఉడకబెట్టిన అన్నంలో కొన్ని నిమ్మ రసం చుక్కలు వేస్తే.. అన్నం పొడిపొడిగా వస్తుంది.. తెల్లగా మల్లెపూవు లా ఉంటుంది. *అన్నం తేలిగ్గా జీర్ణం కావాలంటే, బియ్యాన్ని వేయించి వండుకోవాలి * ఓవెన్ లో బ్రెడ్‌ని కాల్చే సమయంలో.. బ్రెడ్‌తో పాటు చిన్న గినెలో నీరు ఉంచితే.. బ్రెడ్ గట్టిగా అవదు. మంచి రంగులో ఉంటుంది. *వేడి నూనె త్వరగా చల్లబడకుండా ఉండాలంటే.. వేయించడానికి ముందే పాన్‌లో కొద్దిగా ఉప్పు లేదా పిండిని చల్లితే నూనె ఎక్కువ సేపు వేడిగా ఉంటుంది. *చేపలు, క్యాబేజీ వంటివి ఉడికించేటప్పుడు వాసన వస్తుంటాయి. ఇలా వాసన రాకుండా ఉండాలంటే వంట చేసేటప్పుడు స్టవ్ పక్కన ఓ గిన్నెలో వెనిగర్ వేసి ఉంచితే సరి. వెనిగర్ వాటి వాసనని గ్రహించి మనకి ఆ స్మెల్ రాకుండా చేస్తుంది. *గ్లాస్ లు, స్టీల్ గిన్నెలు ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఆ సమయంలో పై గ్లాసును చల్లటి నీటితో నింప్పి వేడి నీటిలో కాసేపు ఉంచితే ఇరుక్కున్న గ్లాసు ఈజీగా వచ్చేస్తుంది. * పాస్తా ఉడికించినప్పుడు ముద్దలా అవుతోందా.. అయితే అవి ఉడికించే గిన్నెలో ఓ చెక్క స్పూన్ కానీ ఫోర్క్ కానీ వేస్తే సరి.. *కోడిగ్రుడ్లను ఉడికించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా, ఉడికించిన వెంటనే గ్రుడ్లను చన్నీళ్ళలో వేసినా పెంకు సులభంగా వస్తుంది *టమోటా వడిలిపోయినట్లయితే వాటిని ఉప్పునీటిలో ఒక రాత్రంతా ఉంచితే తాజాగా మారతాయి.