Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడికి 11 ఏళ్లుగా కొనసాగిన సంప్రదాయం.. ఈ ఏడాది బ్రేక్…తాపేశ్వరం నుంచి అందని లడ్డు

Surya Kala

Surya Kala |

Updated on: Sep 11, 2021 | 6:01 PM

Khairatabad Ganesh:  గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా...చాలా మంది దృష్టి ఖైరతాబాద్ వినాయకుడి మీదే ఉంటుంది. ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటారు. 2019లో 61 అడుగుల ఎత్తున్న వినాయక విగ్రహాన్ని..

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడికి 11 ఏళ్లుగా కొనసాగిన సంప్రదాయం.. ఈ ఏడాది బ్రేక్...తాపేశ్వరం నుంచి అందని లడ్డు
Ganesha

Follow us on

Khairatabad Ganesh:  గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా…చాలా మంది దృష్టి ఖైరతాబాద్ వినాయకుడి మీదే ఉంటుంది. ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటారు. 2019లో 61 అడుగుల ఎత్తున్న వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే గతేడాది కరోనా కారణంగా వినాయక విగ్రహాం 18 అడుగులకే పరిమితం అయ్యింది. ఇక, ఈ ఏడాది 40 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రతిష్టించారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఖైరతాబాద్ గణనాథుడి కోసం అంతే స్థాయిలో భారీ లడ్డూను చేయిస్తారు నిర్వాహకులు. ఈ లడ్డును సాధారణంగా భక్తులకు పంపిణీ చేస్తుంటారు. ఈ ప్రసాదం కోసం వేల సంఖ్యలో భక్తులు రావడం ప్రతి ఏడాది జరుగుతూనే ఉంది. కొన్ని సార్లు వర్షాలకు తడిసి లడ్డు పాడైన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇక, గత 11 ఏళ్లుగా తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌ అధినేత పీవీవీఎస్ మల్లికార్జునరావు ఖైరతాబాద్‌ గణపతి కోసం భారీ లడ్డూను నైవేద్యంగా పంపుతున్నారు. 2010 నుంచి ఆయన ఖైరతాబాద్ గణనాథునికి లడ్డును పంపిస్తున్నారు. ఈ లడ్డు‌ను చాలా భక్తి శ్రద్దలతో తయారు చేయించేవారు. వినాయక నిమజ్జనం తర్వాత మల్లికార్జున రావు, తాను సమర్పించిన లడ్డూలో కొంత భాగాన్ని ప్రసాదంగా తీసుకునేవారు. మిగతా లడ్డూను నిర్వాహకులు, భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టేవారు.

గతేడాది కూడా తాపేశ్వరం నుంచి ఖైరతాబాద్ గణనాథుడికి 100 కిలోల లడ్డును పంపించారు. అయితే గత 11 ఏళ్లుగా కొనసాగిన సంప్రదాయానికి ఈ ఏడాది బ్రేక్ పడింది. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడికి తాపేశ్వరం నుంచి లడ్డు దూరం అయ్యింది. ఈ ఏడాది హైదరాబాద్ వాసీల నుంచి 2000 కేజీలు గల… 2 లడ్డూలను తయారు చేయించారు. ఇందులో వినాయక స్వామి ఎలక్ట్రికల్ అండ్ ఎయిర్ కూలర్స్ యజమాని శ్రీకాంత్ నుంచి 1100 కేజీల లడ్డు కాగా…భక్తాంజనేయ స్వీట్ నుంచి 900 కేజీల లడ్డును స్వామివారికి సమర్పించారు. ప్రత్యేక వాహనాల్లో తీసుకొని వచ్చి…ఖైరతాబాద్ వినాయకుడి కి 2 లడ్డూలను సమర్పించారు.

Also Read:  : చరణ్ ఫ్రెండ్.. నవీన్.. తేజుకి ఎలా స్నేహితుడు అయ్యాడంటే.. తేజు మొదటి క్రికెట్ గురువు ఎవరో తెలుసా..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu