Ganesh Chaturthi: వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు..? విశేషం ఏమిటంటే..!

Ganesh Chaturthi: రుతుధర్మాన్ననుసరించి జరుపుకొనే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైనది. ప్రతియేటా భాద్రపద శుద్ధ చవితినాడు వస్తుంది పండగ. వేసవి..

Ganesh Chaturthi: వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు..? విశేషం ఏమిటంటే..!
Follow us

|

Updated on: Sep 12, 2021 | 9:48 AM

Ganesh Chaturthi: రుతుధర్మాన్ననుసరించి జరుపుకొనే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైనది. ప్రతియేటా భాద్రపద శుద్ధ చవితినాడు వస్తుంది పండగ. వేసవి తాపం తగ్గి, బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పుష్పాలు విచ్చి పరిమళాలు వెదజల్లుతుంటాయి. నదులలో నీరు నిండి జీవనతత్వం అభివృద్ధి చెందుతుంది. బుధుడు అధిపతియైన హస్త… వినాయకుని జన్మనక్షత్రం. బుధగ్రహానికి ఆకుపచ్చనివంటే ఇష్టం. వినాయకునికి కూడా గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనకు గరికతోనూ, వివిధ ఆకులతోనూ పూజిస్తాం. గణేష పూజకు ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను మాత్రమే ఉపయోగించడంలో ఒక విశేషముంది. అదేమంటే జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టికోసం జలాశయాలలో దిగి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. నీళ్లు తేటపడతాయి. అదీకాక మట్టిని తీయడం, దానితో బొమ్మను చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రుమట్టిలో నానడం ఒంటికి మంచిదని ప్రకృతి వైద్యులు చెబుతారు.

ప్రకృతి చికిత్సకు ఒండ్రుమట్టిని వాడటం మనకు తెలిసిందే. అయితే పదిరోజుల పాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని పదకొండోరోజున మేళతాళాలతో జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం ఉంది. పంచ భౌతికమైన ప్రతి ఒక్క పదార్థం.. అంటే పంచభూతాల నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ పదార్థమూ మధ్యలో ఎంత వైభవంగా, ఇంకెంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసిపోవలసిందే. అందుకే ప్రకృతి దేవుడైన వినాయక విగ్రహాలను మట్టితోనే చేస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించి నీటిలో నిమజ్జనం చేస్తారు. అయితే.. తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్నీ, పత్రాలనీ ఇంట్లో ఉంచుకున్న తర్వాత.. దగ్గరలో ఉన్న చెరువు, నది, లేదంటే బావిలో నిమజ్జనం చేస్తారు. అందుకు తగ్గట్టే.. వర్షాకాలం కావడంతో నదులు, చెరువులూ నిండుగా కళకళలాడుతూ ఉంటాయి. ఇటీవల సముద్రాల్లో నిమజ్జనం చేసే సంస్కృతి కూడా ఎక్కువగా కనిపిస్తోంది. మట్టి విగ్రహాల్నీ, పత్రిని నీటిలో నిమజ్జనం చెయ్యడం ద్వారా నీటిలో ఉండే క్రిమి కీటకాలు చనిపోతాయి. ఈ నిమజ్జనం పూర్తవగానే… దసరా సంబరాలు, బతుకమ్మ ఉత్సవాలూ మొదలవుతాయి.

ఇవీ కూడా చదవండి:

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడికి 11 ఏళ్లుగా కొనసాగిన సంప్రదాయం.. ఈ ఏడాది బ్రేక్…తాపేశ్వరం నుంచి అందని లడ్డు

Soybean Ganesh Idol: గణపతి మండపంలో కొలువుదీరిన సోయాబీన్ గణేశుడు.. కేవలం రూ. 1000 లతో తయారీ.. ఎక్కడంటే..