అమృతా రావ్ పెద్ద మనసు.. ఏం చేసిందో తెలుసా..
అతిథి సినిమాలో తళుక్కున మెరిసి మాయమైన బాలీవుడ్ బ్యూటీ అమృతా రావు గుర్తుందా… సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఈ ముద్దుగుమ్మ లాక్ డౌన్ సమయంలో తన దాతృత్వాన్ని చాటుకుంది. ముంబైలోని తన ఇంట్లో ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నవారికి తనవంతు సహాయాన్ని అందించింది. తన ఇంట్లో అద్దెకుంటున్నవారికి అద్దె ఇవ్వవాల్సిన అవసరం లేదని చెప్పి పెద్ద మనసును చాటుకుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో […]

అతిథి సినిమాలో తళుక్కున మెరిసి మాయమైన బాలీవుడ్ బ్యూటీ అమృతా రావు గుర్తుందా… సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఈ ముద్దుగుమ్మ లాక్ డౌన్ సమయంలో తన దాతృత్వాన్ని చాటుకుంది. ముంబైలోని తన ఇంట్లో ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నవారికి తనవంతు సహాయాన్ని అందించింది.
తన ఇంట్లో అద్దెకుంటున్నవారికి అద్దె ఇవ్వవాల్సిన అవసరం లేదని చెప్పి పెద్ద మనసును చాటుకుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఉన్నవారిని అర్థం చేసుకుని వారికి నావంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. తన ఇంటిలో అద్దుకుంటున్న వారు ఉద్యోగాలు ఏమి కోల్పోలేదని.. కానీ లాక్‌డౌన్‌తో ఇబ్బందిపడుతున్నారని వెల్లడించింది. తన ఇంట్లో అద్దెకు ఉండావారంతా సినిమా ఇండస్ట్రీకి చెందినవారని చెప్పింది.




