మహారాష్ట్రలో కరోనా కల్లోలం.. ఒకే భవనంలో 21 మందికి వైరస్..
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మలబార్ హిల్ ఏరియాలోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో

Building In Mumbai’s Malabar Hill Sealed : కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మలబార్ హిల్ ఏరియాలోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో కరోనా కలకలం రేపుతోంది. గత ఏడు రోజుల్లో ఆ కాంప్లెక్స్ లో 21 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సోమవారం వెల్లడించారు. ఈ 21 మందిలో 19 మంది.. పని మనుషులు, డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారని తెలిపారు.
కాగా.. పని మనషులు పలు నివాసాల్లో పని చేస్తుండటంతో.. వీరి ద్వారా మరికొంత మందికి కరోనా సోకి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆ భవనాన్ని పూర్తిగా అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకినా వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించామని అధికారులు తెలిపారు. భవనాన్ని మొత్తం శానిటైజ్ చేస్తున్నామని, అక్కడున్న కామన్ టాయిలెట్స్ ను రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు శానిటైజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.



