Omicron: ఒమిక్రాన్ టెర్రర్ క్రియేట్ చేస్తోన్న వేళ.. ఓ గుడ్ న్యూస్, ఓ బ్యాడ్ న్యూస్ చెప్పిన WHO
లోకమంతా ఒమిక్రాన్‌కు భయపడుతోంది. ఈ టైంలో ఓ గుడ్‌న్యూస్, మరో బ్యాడ్‌న్యూస్ చెప్పింది, WHO. గుడ్‌న్యూస్ ఏంటీ, బ్యాడ్‌న్యూస్ ఏంటీ? ఈ స్టోరీలో తెలుసుకుందం.
కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చి, లక్షలాది మందికి ఎగ్జిట్ కార్డు ఇచ్చింది. దీనికి వేరియంట్లు, డెల్టాలు, ఒమిక్రాన్‌లు తోడయ్యాయి. దీంతో ఇంకా ఆగమైంది మానవలోకం. మహమ్మారి భయంతోనే అన్ని వేడుకలు, పండగలు చేసుకుంది ప్రపంచం. తాజాగా 2022 కొత్త ఏడాదికి కూడా వైరస్ వర్రీతోనే స్వాగతం చెప్పాయి ప్రపంచదేశాలు. ఒమిక్రాన్ భయాలు నెలకొన్న వేళ శుభవార్త చెప్పింది WHO. వైరస్‌పై కీలక కామెంట్స్ చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ ట్రెడోస్. కరోనా సంక్షోభంతో మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన ప్రపంచానికి 2022లో ఈ వైరస్ ముంగిపు చూసే అవకాశం ఉందన్నారు డబ్ల్యూహెచ్ఓ డెరెక్టర్ టెడ్రోస్ అథనోమ్. ఈ ఏడాదిలో ప్రపంచం ఎదుర్కొనే ఆరోగ్య ముప్పు కేవలం కొవిడ్ కాదని, ఇంకా చాలానే ఉన్నాయని మరో బాంబ్ పేల్చారు టెడ్రోస్.
కొవిడ్ సంక్షోభంలో పడిపోయిన ప్రజలు సాధారణ వ్యాక్సినేషన్, ఫ్యామిలీ ప్లానింగ్, మిగిలిన రోగాలకు చికిత్స తీసుకోవడంలో అలసత్వం చూపారని అన్నారు టెడ్రోస్. కరోనాను కట్టడి చేసేందుకు, చికిత్స అందించేందుకు చాలా కొత్త సాధనాలు ఉన్నాయని, సుదీర్ఘ కాలం పాటు దేశాల మధ్య అసమానతలు కొనసాగితే నియంత్రించలేనంతగా, అంచనా వేయలేనంతగా వైరస్ ప్రమాదకరంగా మారుతుందన్నారు WHO డైరెక్టర్. అసమానతలకు ముగింపు పలికితేనే ఈ మహమ్మారిని అంతం చేయగలుగుతామని, కొవిడ్ మహమ్మారి వచ్చి మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న క్రమంలో ఈ సంవత్సరంలోనే దానికి ముగింపు ఉంటుందనే నమ్మకం ఉంద్నారాయన. కానీ కలిసికట్టుగా పోరాడితేనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు టెడ్రోస్ అథనోమ్.
Also Read: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. నూటికి 99 మంది దాన్ని కనిపెట్టడంలో ఫెయిల్ అయ్యారు
ఆమ్లెట్ వేసేందుకు గుడ్డు పగలగొట్టగానే బయటకు వచ్చిన అతిథి.. అందరూ షాక్