కొత్త ప్రయాణం మొదలు పెట్టిన సమంత

టాలీవుడ్ ప్రముఖ నటి అక్కినేని సమంత కొత్త జర్నీ మొదలు చేయనుంది. స్టార్ హీరోయిన్‌గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సమంత ఇప్పుడు ఎడ్యుకేషన్ రంగంలోకి కూడా అడుగు పెట్టబోతుంది. తన ఫ్రెండ్స్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి..

కొత్త ప్రయాణం మొదలు పెట్టిన సమంత
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 24, 2020 | 4:03 PM

టాలీవుడ్ ప్రముఖ నటి అక్కినేని సమంత కొత్త జర్నీ మొదలు చేయనుంది. స్టార్ హీరోయిన్‌గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సమంత ఇప్పుడు ఎడ్యుకేషన్ రంగంలోకి కూడా అడుగు పెట్టబోతుంది. తన ఫ్రెండ్స్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి, ఎడ్యుకేషనిస్ట్ ముక్తా ఖురానాతో కలిసి ‘ఏక్కం’ అనే ప్రీ-స్కూళ్లను జూబ్లీహిల్స్‌లో ప్రారంభించిందట సమంత. ఇందుకు సంబంధించి అధికారికంగా సామ్ ట్వీట్ చేసింది. కోవిడ్ మహమ్మారి ప్రభావం లేకపోతే ఈ పాటికే ఈ ప్రీ స్కూల్ స్టార్ట్ అయ్యేదట. జీవితానికి బలమైన పునాదులు వేయడంలో విద్యార్థులకు సాయమందించడానికి.. విద్యా విధానంలో సరికొత్త ఆవిష్కరణ, నైపుణ్యాన్ని తీసుకురావాలనే ఉద్ధేశంతో ఈ ప్రీ-స్కూల్ ఏర్పాటు చేసినట్లు సమంత తెలిపింది.

Read More:

సరదాగా చేపలు పట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ప్రముఖ సీనియర్ నటి ఇంట విషాదం

కాస్టింగ్ కౌచ్‌పై అనుష్క కీలక వ్యాఖ్యలు

డబ్బులు కావాలంటే కాల్ చేయండి.. ఏటీఎం ఇంటికే వచ్చేస్తుంది