సరదాగా చేపలు పట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కాలక్షేపం కోసం సరదాగా చేపలు పట్టారు. ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా బాంద్రా వర్లీ బ్రిడ్జి దగ్గర కాసేపు ఆగారు. ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు ప్రవహిస్తూండటాన్ని చూసిన ఎమ్మెల్యే..

సరదాగా చేపలు పట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 24, 2020 | 3:28 PM

మహబూబ్ నగర్ దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కాలక్షేపం కోసం సరదాగా చేపలు పట్టారు. ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా బాంద్రా వర్లీ బ్రిడ్జి దగ్గర కాసేపు ఆగారు. ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు ప్రవహిస్తూండటాన్ని చూసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అక్కడ కాసేపు ఆగి.. నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఇంతలో అక్కడ కొంత మంది గాలాలతో చేపలు పడుతూండటం గమనించి అక్కడికి వెళ్లారు. వారి వద్ద ఉన్న ఒక గాలాన్ని తీసుకుని తాను కూడా చేపలు పట్టారు. తాను కూడా చిన్నతనంలో సరదాగా గాలాలతో చేపలు పట్టేవాడినన్నారు ఎమ్మెల్యే. మళ్లీ ఇన్నాళ్లకు ఆ అవకాశం ఇప్పుడు దొరికిందని, గాలం వేసి చేపలు పట్టడం ఆనందంగా ఉందన్నారు. కాగా తన గాలానికి కూడా చేప పడంతో ఎమ్మెల్యే ఆల వెంకటేవ్వర్ రెడ్డి ఆనంద పడ్డారు. ఆయనతో పాటు అక్కడున్న స్థానికులు, కార్యకర్తలు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

Read More:

ప్రముఖ సీనియర్ నటి ఇంట విషాదం

బ్రేకింగ్: సెప్టెంబర్ 3న ఏపీ కేబినెట్

కాస్టింగ్ కౌచ్‌పై అనుష్క కీలక వ్యాఖ్యలు

డబ్బులు కావాలంటే కాల్ చేయండి.. ఏటీఎం ఇంటికే వచ్చేస్తుంది