ధారవిలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. అప్రమత్తమైన అధికారులు..

కరోనా మహమ్మారి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వణికిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రెండు లక్షల మార్క్‌ను దాటేసిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల్లో అత్యధికంగా..

ధారవిలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. అప్రమత్తమైన అధికారులు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 09, 2020 | 7:36 PM

కరోనా మహమ్మారి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వణికిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రెండు లక్షల మార్క్‌ను దాటేసిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి. అయితే అక్కడ ఉన్న ధారవి మురికి వాడలో కరోనా కేసులు ఇన్ని రోజులు అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మళ్లీ అక్కడ కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా.. గురువారం నాడు కొత్తగా మరో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ధారవి ప్రాంతంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,347కి చేరింది. ఈ విషయాన్ని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌ అధికారులు వెల్లడించారు.