జూమ్ యాప్ ఎక్కడిదో తెలుసా..

Zoom an American Company not Chinese : జూమ్.. అనగానే గుర్తుకు వచ్చేది చైనా యాప్.. లాక్ డౌన్ సమయంలో ఆఫీసు అవసరాలు తీర్పుకొనేందుకు కోట్లాది మంది ఉపయోగించిన వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ఇదే… ఇందులో భద్రతాపరమై పాలున్నాయని హెచ్చరించినా ఇప్పటికీ ఎక్కువ సంఖ్యలోనే జూమ్ మీటింగ్ ను వాడుతున్నారు. ఇప్పుడు జూమ్ యాప్‌కు  పోటీగా జియోమీట్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉన్నప్పటికీ జూమ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుంటున్నవారి సంఖ్య ఏ మాత్రం […]

జూమ్ యాప్ ఎక్కడిదో తెలుసా..
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 09, 2020 | 7:36 PM

Zoom an American Company not Chinese : జూమ్.. అనగానే గుర్తుకు వచ్చేది చైనా యాప్.. లాక్ డౌన్ సమయంలో ఆఫీసు అవసరాలు తీర్పుకొనేందుకు కోట్లాది మంది ఉపయోగించిన వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ఇదే… ఇందులో భద్రతాపరమై పాలున్నాయని హెచ్చరించినా ఇప్పటికీ ఎక్కువ సంఖ్యలోనే జూమ్ మీటింగ్ ను వాడుతున్నారు. ఇప్పుడు జూమ్ యాప్‌కు  పోటీగా జియోమీట్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉన్నప్పటికీ జూమ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుంటున్నవారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.

చైనాకు బుద్ధిచెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం 59 యాప్లను నిషేదించిన నేపథ్యంలో జూప్ యాప్ పైనా అనుమానాలు వచ్చాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ఇది చైనా యాప్ అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ చిక్కు సమస్యకు జూమ్ కంపెనీ జవాబు చెప్పింది. తమది ‘మేడిన్ చైనా’ యాప్ కాదని భారతీయులకు జూమ్ చెప్పుకొచ్చింది.

తమకు భారత్ ఎప్పటికీ పెద్ద ముఖ్యమైన మార్కెట్ గానే ఉంటుందని జూమ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్స్ విభాగం అధ్యక్షుడు వెల్చామి శంకరలింగమ్ అంటున్నారు. స్థానికులకు తాము పెద్దపీట వేస్తున్నాయని వెల్లడించారు. జూమ్‌ను చైనాకు ముడిపెడుతూ అపోహలు రావడం మమ్మల్ని బాధిస్తోంది. కానీ నిజాలు వేరు. అని వివరణ ఇచ్చారు.

తమది అమెరికా కంపెనీ అని తెలిపారు. కాలిపోర్నియాలోని శాన్జోన్స్ లో దీనిని స్థాపించారని తెలిపారు. చాలా టెక్నాలజీ సంస్థల్లాగే తమ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉందన్నారు. అమెరికాలోని మాతృసంస్థకే చైనాలోనూ అనుబంధ కంపెనీలు ఉన్నాయని… మున్ముందు తమ కంపెనీ డిజిటల్ ఇండియా, స్థార్టప్ ఇండియా, స్కిల్స్ ఇండియాకు ఎక్కువ మద్దతు ఇస్తామని శంకర లింగమ్ ప్రకటించారు.