తమిళనాడులో రికార్డు స్థాయిలో కేసులు నమోదు..
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే లక్షమార్క్ దాటిన సంగతి తెలిసిందే. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతుండటంతో.. స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా..
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే లక్షమార్క్ దాటిన సంగతి తెలిసిందే. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతుండటంతో.. స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా గురువారం నాడు కొత్తగా మరో 4,231 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,26,581కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 46,652 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 65 మంది మరణించారు. కాగా, రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చెన్నై నగరంలోనే నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు చోట్ల నిబంధనలను కఠినతరం చేసింది ప్రభుత్వం.
కాగా, దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. మహరాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత తమినాడు, ఢిల్లీ రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఏడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Tamil Nadu reports 65 deaths and 4,231 new #COVID19 positive cases today. The total number of positive cases stands at 1,26,581 including 46,652 active cases and 1,765 deaths: State Health Department pic.twitter.com/PPQ7HwvEpM
— ANI (@ANI) July 9, 2020