AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: దేశంలో మళ్లీ కరోనా ప్రకంపనలు.. ఒక్కరోజే 335 కొత్త కేసులు, ఐదుగురు మృతి

మహమ్మారి ప్రాబల్యం ముగిసిపోయిందనుకున్నాం. ఇక మూతికి మాస్కు పెట్టే పని లేదు అనుకున్నాం. కరోనాను జయించామని భావించాం. కానీ పోలేదు.. ఆ మహమ్మారి మరోసారి జడలు విప్పింది. కోవిడ్ కారణంగా కొత్తగా ఐదుగురు మృతి చెందగా.. 335 కొత్త కేసులు వెలుగుచూశాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Coronavirus: దేశంలో మళ్లీ కరోనా ప్రకంపనలు.. ఒక్కరోజే 335 కొత్త కేసులు, ఐదుగురు మృతి
Coronavirus
Ram Naramaneni
|

Updated on: Dec 18, 2023 | 10:27 AM

Share

కరోనా ఖతం అనుకున్నవాళ్లకు కంగారు పుట్టించే వార్త ఇది. ఈ వైరస్‌ జమానా ముగిసిందని లైట్‌ తీసుకున్న వాళ్లకు సరికొత్త హెచ్చరిక ఇది. ఒకవైపు JN-1 అనే కొత్త సబ్‌ వేరియెంట్‌ భయం పుట్టిస్తుంటే, ఇంకోవైపు దేశంలో ఒక్కరోజే 335 కొత్త కరోనా కేసులు రిజిస్టర్‌ అయ్యాయి. అంతేగాదు, ఈ వైరస్‌ కాటుకు ఐదుగురు చనిపోయారు. ఈ ఐదుగురిలో నలుగురు కేరళకు చెందిన వారైతే, ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి.  దేశంలో ఇప్పుడు 1701 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయంటే నమ్ముతారా? ఆశ్చర్యపోయినా ఇది మాత్రం నిఖార్సయిన నిజం.

ప్రపంచాన్ని వణికించిన కరోనాను మనం ఒకరకంగా మరచిపోయాం. మాస్కులు, టీకాలు, జాగ్రత్తలు అన్నీ హుష్‌కాకి అయిపోయాయి. కానీ ఇంతలోనే JN-1 అనే కరోనా కొత్త సబ్‌ వేరియెంట్‌ ట్రేస్‌ అయింది. కేరళలో దీన్ని గుర్తించారు అనగానే ఒక్కసారిగా మళ్లీ కంగారు పుట్టింది. JN-1 అనే కొత్త సబ్‌ వేరియెంట్‌ను సెప్టెంబర్‌లో అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత ఈ సబ్‌ వేరియంట్‌కి సంబంధించిన ఏడు కేసులనే చైనాలో కూడా గుర్తించారు. ఆ తరహాలోనే తొలి కేసు మనదేశంలోనూ కేరళలోని తిరువనంతపురంలో నమోదయ్యింది.

ఈనెల ఎనిమిదో తేదీన కేరళలో 78 ఏళ్ల మహిళలో ఈ వేరియంట్‌కి సంబంధించిన తేలికపాటి లక్షణాలను గుర్తించారు అధికారులు. ఇది సులభంగా సోకే సామర్థ్యం ఉన్న వ్యాధిగా కనపించడమే శాస్త్రవేత్తలను కలవరపరుస్తోంది. దాంతోపాటు.. ఈ కేసులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తాయేమోనని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

వాస్తవానికి JN-1 వేరియెంట్‌ భారతీయులకు సోకడం అధికారికంగా ఇదే తొలిసారి. కానీ కొన్ని నెలల కిందటే సింగపూర్‌ ఎయిర్‌పోర్టులో కొందరు భారతీయుల్లో ఈ కొత్త వేరియెంట్‌ను గుర్తించినట్లు తెలు్తోంది. అయితే ఇప్పటికైతే మరీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.