AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: బీ అలర్ట్.. కరోనా మళ్లొచ్చింది.. కొత్త వేరియంట్‌తో ఐదుగురు మృతి.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు..

ప్రపంచంలో కరోనావైరస్ ప్రమాద ఘంటికలు మళ్లీ మోగుతున్నాయి. అమెరికాలో అలజడి సృష్టించిన కరోనా కొత్త వేరియంట్‌.. ఇప్పుడు భారతదేశంలోనూ కలకలం రేపుతోంది. కరోనా మహమ్మారి గురించి మర్చిపోదామనుకునేలోపే ఎక్కడో ఒక చోట ఏదో కేసు రూపంలో నమోదై హడలెత్తిస్తుండటం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు తగ్గుముఖం పట్టాయనుకునే లోపే.. కోవిడ్ మళ్లీ మరో రూపంతరం మార్చుకుని జేఎన్‌ 1 అనే కొత్త వేరియంట్‌ కేసులతో కలకలం సృష్టిస్తోంది.

Coronavirus: బీ అలర్ట్.. కరోనా మళ్లొచ్చింది.. కొత్త వేరియంట్‌తో ఐదుగురు మృతి.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు..
Coronavirus
Shaik Madar Saheb
|

Updated on: Dec 18, 2023 | 6:54 PM

Share

ప్రపంచంలో కరోనావైరస్ ప్రమాద ఘంటికలు మళ్లీ మోగుతున్నాయి. అమెరికాలో అలజడి సృష్టించిన కరోనా కొత్త వేరియంట్‌.. ఇప్పుడు భారతదేశంలోనూ కలకలం రేపుతోంది. కరోనా మహమ్మారి గురించి మర్చిపోదామనుకునేలోపే ఎక్కడో ఒక చోట ఏదో కేసు రూపంలో నమోదై హడలెత్తిస్తుండటం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు తగ్గుముఖం పట్టాయనుకునే లోపే.. కోవిడ్ మళ్లీ మరో రూపంతరం మార్చుకుని జేఎన్‌ 1 అనే కొత్త వేరియంట్‌ కేసులతో కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన తొలి కేసును సెప్టెంబర్‌లో అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత ఈ సబ్‌ వేరియంట్‌కి సంబంధించిన ఏడు కేసులనే చైనాలో కూడా గుర్తించారు. ఆ తరహాలోనే తొలి కేసు మనదేశంలోనూ కేరళలోని తిరువనంతపురంలో నమోదయ్యింది. డిసెంబర్‌ 8న కేరళలో 78 ఏళ్ల మహిళలో ఈ వేరియంట్‌కి సంబంధించిన తేలికపాటి లక్షణాలను గుర్తించారు అధికారులు. ఓమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ 2.86 లాంటి వేరియంట్‌గానే పరిగణించారు. తాజాగా.. కరోనాతో ఐదుగురు మరణించడం కలకలం రేపింది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.

కేరళలో కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేరళలో నలుగురు, యూపీలో ఒకరు మరణించారు. ఇండియా సహా 38 దేశాల్లో కొత్త వేరియంట్ JN.1 గుర్తించారు. దీంతో భారత ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ రాష్ట్రలకు సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మార్గదర్శకాలతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. అప్రమత్తంగా ఉంటూ, కొత్త కేసులపై నిఘా ఉంచాలని అదేశించింది. RTPCR టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని.. వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు నిర్వహించాలని సూచించింది. వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచనలు చేసింది.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..