ఢిల్లీలో లక్షకు చేరువలో కరోనా కేసులు..

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత.. దేశంలో నమోదవుతున్న కేసులు ఢిల్లీలోనే నమోదవ్వడం గమనార్హం. రోజురోజుకు పెరుగుతున్న కేసులు చూసి..

ఢిల్లీలో లక్షకు చేరువలో కరోనా కేసులు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 04, 2020 | 8:40 PM

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత.. దేశంలో నమోదవుతున్న కేసులు ఢిల్లీలోనే నమోదవ్వడం గమనార్హం. రోజురోజుకు పెరుగుతున్న కేసులు చూసి.. రాజధాని ప్రజలు వణికిపోతున్నారు. కేసుల సంఖ్య పెరగడమే కాకుండా.. అటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా శనివారం నాడు కొత్తగా మరో 2,505 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97,200కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 55 మంది మరిణించారు.దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి ఢిల్లీ వ్యాప్తంగా 3,004 మంది మరణించారు. అయితే ఇక్కడ రికవరీ రేటు బాగుండటం.. కాస్త ఊరటినిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా 25,940 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 68,256 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

కాగా, శనివారం నాడు ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు నిర్వహించారు. ఆర్టీ-పీసీఆర్ విధానంతో 9,925 చేయగా.. రాపిడ్ యాంటీజెన్‌ విధానంతో 13,748 టెస్టులు జరిపారు. వీటి రిపోర్టులు ఆదివారం నాడు రానున్నాయి. ఇక ఇప్పటి వరకు 6.20 లక్షల పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.