India Corona cases: దేశంలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. ఈ రాష్ట్రాల్లోనే అత్యధికం
ఇండియాలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత కొద్దిరోజులుగా 8 వేలకు పైగా నమోదవుతోన్న కొత్త కేసుల సంఖ్య తాజాగా 12 వేల మార్కు దాటింది.
Coronavirus News: దేశంలో కొవిడ్ కేసులు టెన్షన్ పెడుతున్నారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు కొత్తగా 12,213 మందికి వైరస్ సోకింది. క్రితం రోజు కంటే 38.4 శాతం అధికంగా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగించే విషయం. కాగా దేశంలో మొత్తం కోవిడ్ కేసులు సంఖ్య 43,257,730కు చేరింది. మరో 11 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,803కి చేరింది. కొత్తగా 7,624 మంది వ్యాధి బారి కోలుకున్నారు. ఫలితంగా మొత్తం రికవరీ కేసుల సంఖ్య 4,26,74,712కి చేరింది. ప్రస్తుతం దేశంలో 58,215 యాక్టివ్ కేసులున్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది. మహారాష్ట్ర(Maharashtra), కేరళ(Kerala), ఢిల్లీ, కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా మారింది. ఒక్క ముంబయిలోనే బుధవారం రెండువేలకుపైగా కేసులొచ్చాయి. ఢిల్లీలో వరుసగా రెండోరోజు 1,100 మందికి పైగా కరోనా బారినపడ్డారు. దేశవ్యాప్తంగా బుధవారం 15,21,942 మందికి వ్యాక్సిన్ అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,95,67,37,014 కోట్లకు చేరింది. మరో 5,19,419మందికి కోవిడ్ టెస్టులు చేశారు.
కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరుతున్నారు.
మరిన్ని కోవిడ్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి