Bank Jobs 2022: విశాఖపట్నం కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌.. 30 ప్రొబేషనరీ ఆఫీసర్/డిప్యూటీ మేనేజర్ ఐటీ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

Bank Jobs 2022: విశాఖపట్నం కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
Visakhapatnam Cooperative Bank Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 09, 2022 | 5:54 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌.. 30 ప్రొబేషనరీ ఆఫీసర్/డిప్యూటీ మేనేజర్ ఐటీ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 20 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 14, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్ధులందరూ తప్పనిసరిగా రూ.1000లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష (ప్రిలిమ్స్‌, మెయిన్‌) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష జనవరి/ఫిబ్రవరి 2023లో నిర్వహించే అవకాశం ఉంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.45,590ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం..

రాత పరీక్ష ప్రిలిమ్స్‌, మెయిన్‌ ఫేజ్‌లలో జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 100 మార్కులకు 100 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నల చొప్పున గంటన్నర సమయంలో రాయవల్సి ఉంటుంది. మెయిన్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు పేపర్లకు నిర్వహిస్తారు. మొదటి పేపర్‌లో 155 ప్రశ్నలకు 200 మార్కులకు రెండున్నర గంటల సమయంలో పరీక్ష జరుగుతుంది. రెండో పేపర్‌లో 3 ప్రశ్నలకు 50 మార్కులు.. 30 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. అంటే మెయిన్‌ పరీక్ష మొత్తం 250 మార్కులకు 158 ప్రశ్నలకు మూడు గంటల సమయంలో పరీక్ష ఉంటుందన్నమాట.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.