VCBL Recruitment 2022: విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 35 వేలు జీతం..
VCBL Recruitment 2022: ది విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (వీసీబీఎల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖపట్నంలోని ఈ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్...
VCBL Recruitment 2022: ది విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (వీసీబీఎల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖపట్నంలోని ఈ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 30 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా కంప్యూటర్ నాలెడ్జ్‌తోపాటు ఇంగ్లిష్, తెలుగు భాషలు మాట్లాడటం, చదవడం వచ్చి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 31.12.2021 నాటికి 20 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 25 మార్కులు కేటాయిస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభంలో రూ. 35,000 చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 11-01-2022న ప్రారంభం కాగా, 31-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: IPL 2022 Mega auction: ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖరారు.. తేదీలు, వేదిక వివరాలివే..
Viral Video: చిన్న పిల్లాడిని ఓదార్చిన శునకం.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు..