Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Exam Schedule 2024: నిరుద్యోగులకు అలర్ట్.. యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్యాలెండర్-2024 విడుదల

పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (UPSC) కీలక ప్రకటన వెలువరించింది. ప్రతి ఏటా మాదిరి గానే ఈ ఏడాది కూడా యపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్‌-2024ను విడుదల చేసింది. వచ్చే ఏడాది యూపీఎస్సీ నిర్వహించే వివిధ పరీక్షలకు సంబంధించిన పరీక్షలకు సంబంధించిన ఎగ్జాం క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, ఐఎఫ్‌ఎస్‌, ఐఈఎస్, ఎన్‌డీఏ అండ్ సీడీఎస్‌తో సహా సలు ముఖ్యమైన పరీక్షల తేదీలను ఎగ్జాం క్యాలెండర్‌లో వెలువరించింది. ఏయే పరీక్ష..

UPSC Exam Schedule 2024: నిరుద్యోగులకు అలర్ట్.. యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్యాలెండర్-2024 విడుదల
UPSC Exam Schedule 2024
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 19, 2023 | 10:04 PM

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 19: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (UPSC) కీలక ప్రకటన వెలువరించింది. ప్రతి ఏటా మాదిరి గానే ఈ ఏడాది కూడా యపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్‌-2024ను విడుదల చేసింది. వచ్చే ఏడాది యూపీఎస్సీ నిర్వహించే వివిధ పరీక్షలకు సంబంధించిన పరీక్షలకు సంబంధించిన ఎగ్జాం క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, ఐఎఫ్‌ఎస్‌, ఐఈఎస్, ఎన్‌డీఏ అండ్ సీడీఎస్‌తో సహా సలు ముఖ్యమైన పరీక్షల తేదీలను ఎగ్జాం క్యాలెండర్‌లో వెలువరించింది. ఏయే పరీక్ష ఏయే తేదీల్లో ఉంటుందంటే..

యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్‌-2024 పరీక్షలు, వాటి తేదీలు ఇవే..

  • యూపీఎస్సీ ఎన్‌డీఏ అండ్ సీడీఎస్ (I) – 2024 రాత పరీక్ష ఏప్రిల్ 21న జరుగుతుంది.
  • యూపీఎస్సీ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ (IES) ప్రిలిమినరీ పరీక్ష జూన్ 21వ తేదీన జరుగుతుంది.
  • యూపీఎస్సీ సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ – 2024 మార్చి 10న జరుగుతుంది.
  • యూపీఎస్సీ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష ఫిబ్రవరి 18న జరుగుతుంది.
  • యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2024 ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 18న జరుగుతుంది.
  • యూపీఎస్సీ సీఐఎస్‌ఎఫ్ ఏసీ (EXE) ఎల్‌డీసీఈ – 2024 ఎగ్జామ్ మార్చి 10న జరుగుతుంది.
  • యూపీఎస్సీ ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (1) – 2024 ఏప్రిల్ 21న జరుగుతుంది.
  • యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ – 2024 మే 26, 2024న జరుగుతుంది.
  • యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ -2024 కూడా మే 26వ తేదీనే జరగనుంది.
  • యూపీఎస్సీ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ – 2024 జూన్ 22న నిర్వహిస్తారు.
  • యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ – 2024 జూన్ 23న జరుగుతుంది.
  • యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2024 జులై 14న జరుగుతుంది.
  • యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్ 2024 సెప్టెంబర్ 20న జరుగుతుంది.
  • యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (ACs) ఎగ్జామినేషన్-2024 ఆగస్టు 4న జరుగుతుంది.
  • యూపీఎస్సీ ఎడీఏ అండ్ ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (II) – 2024 సెప్టెంబర్ 1న జరుగుతుంది.
  • యూపీఎస్సీ సీడీఎస్ ఎగ్జామినేషన్ (II) – 2024 సెప్టెంబర్ 1న జరుగుతుంది.
  • యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) ఎగ్జామినేషన్ – 2024 నవంబర్ 24న జరుగుతుంది.
  • యూపీఎస్సీ ఎస్‌వో/ స్టెనో (జీడీ-బీ/జీడీ-1) ఎల్‌డీసీ ఎగ్జామ్ – జులై7న జరగనుంది.

కాగా.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్-ఏ ఆఫీసర్స్ పోస్ట్‌లతో పాటు ఇతర ఉద్యోగాల భర్తీకి ఇది నియామక ప్రక్రియను చేపడుతుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE), ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ESE), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) పరీక్షలతో సహా అనేక పరీక్షలు యూపీఎస్సీ పారదర్శకంగా నిర్వహించి.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) ఇండియన్‌ ఫారిన్ సర్వీస్ (IFS) వంటి పలు ప్రతిష్టాత్మక కొలువులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.