Layoffs: ఐటీ రంగంలో అలజడి.. ప్రతీ గంటకు 23 మంది టెకీలు ఊస్టింగ్..
చిన్న చితకా స్కార్టప్‌ల నుంచి బడా మల్టీ నేషనల్ కంపెనీల వరకు ఉద్యోగులను నిర్ధాక్షణ్యంగా తొలగిస్తున్నాయి. ఎఫ్‌వైఐ అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు కంపెనీలు ఏకంగా 2.40 లక్షల మందిని తొలగించినట్లు తెలుస్తోంది. గతేడాది మొత్తం ఈ సంఖ్య 1,54,336 మంది కాగా ఈ ఏడాది 9 నెలల్లోనే తొలగించిన ఉద్యోగుల సంఖ్య రెండున్నర లక్షలకు చేరువకావడం గమనార్హం. ఇదిలా ఉంటే వచ్చే డిసెంబర్...
ప్రపంచాన్ని ఆర్థికమాంద్య భయాలు ఇప్పట్లో వదిలేలా లేవు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో మరోవైపు ఉద్యోగుల తొలగింపులు భయపెడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా టెక్ దిగ్గజాలన్నీ వరుసగా లేఆఫ్స్ ప్రకటిస్తూ గుబులు రేపుతున్నాయి.
చిన్న చితకా స్కార్టప్‌ల నుంచి బడా మల్టీ నేషనల్ కంపెనీల వరకు ఉద్యోగులను నిర్ధాక్షణ్యంగా తొలగిస్తున్నాయి. ఎఫ్‌వైఐ అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు కంపెనీలు ఏకంగా 2.40 లక్షల మందిని తొలగించినట్లు తెలుస్తోంది. గతేడాది మొత్తం ఈ సంఖ్య 1,54,336 మంది కాగా ఈ ఏడాది 9 నెలల్లోనే తొలగించిన ఉద్యోగుల సంఖ్య రెండున్నర లక్షలకు చేరువకావడం గమనార్హం. ఇదిలా ఉంటే వచ్చే డిసెంబర్ నాటికి క్వాల్కమ్ తమ ఉద్యోగుల్లో 2.5 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషం తెలిసిందే.
వీటితో పాటు ప్రముఖ టెక్ కంపెనీలన్నీ ఇదే దిశగా అడుగులు వేస్తున్నాయి. సిస్కో సిస్టమ్స్, రోకు, మైక్రోసాఫ్ట్, పోకెమాన్ గో తదితర సంస్థలు కూడా ఉద్యోగుల బారాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఓ అంచనా ప్రకారం గడిచిన రెండేళ్లలో ప్రతీ గంటకూ ఏకంగా 23 మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2120 కంపెనీలు సుమారు 4 లక్షల మంది టెకీలను ఇంటికి పంపించినట్లు ఎఫ్‌వైఐ తెలిపింది.
ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన సిటీ గ్రూప్ ఏకంగా రెండు వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. బ్యాంకు పునర్‌వ్వవస్థీకరణలో భాగంగా 2 వేల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో ప్రముఖ జాబ్ పోర్టల్ లింక్డిన్ కూడా వచ్చి చేరింది. ఈ సంస్థ రెండో లేఆఫ్స్‌లో భాగంగా ఏకంగా 3 శాతం మందిని అంటే 668 మందిని ఉద్యోగుల నుంచి తొలగిస్తున్న ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం నోకియా సైతం తన ఉద్యోగులను తగ్గించుకునేందుకు కసరత్తులు మొదలు పెట్టింది. మూడో త్రైమాసిక ఆదాయాలు క్షీణించడంతో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఇందులో బాగంగా 14,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు నోకియా తెలిపింది. ప్రస్తుతం నోకియాలో సుమారు 86వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..