UPSC Jobs 2025: నిరుద్యోగులకు భలే ఛాన్స్.. ఎలాంటి రాత పరీక్షలేకుండా యూపీఎస్సీలో 493 ఉద్యోగాలు! రెండు రోజులే గడువు
యూపీఎస్సీ వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 493 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 493 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 12, 2025వ తేదీ తుది గడువులోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఖాళీల వివరాలు..
- లీగల్ ఆఫీసర్ (గ్రేడ్-1) పోస్టుల సంఖ్య: 02
- ఆపరేషన్స్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 121
- సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 12
- సైంటింస్ట్-బీ (మెకానికల్) పోస్టుల సంఖ్య: 01
- అసోసియేట్ ప్రొఫెసర్ (సివిల్) పోస్టుల సంఖ్య: 02
- అసోసియేట్ ప్రొఫెసర్ (మెకానికల్) పోస్టుల సంఖ్య: 01
- సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 03
- జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 24
- డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 01
- జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 05
- ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 01
- ప్రిన్సిపల్ డిజైన్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 01
- రీసెర్చ్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 01
- ట్రాన్స్ లేటర్ పోస్టుల సంఖ్య: 02
- అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ పోస్టుల సంఖ్య: 05
- అసిస్టెంట్ డైరెక్టర్ (ఆఫీషియల్ లాంగ్వేజ్) పోస్టుల సంఖ్య: 17
- డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల సంఖ్య: 20
- పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ గ్రేడ్-3 పోస్టుల సంఖ్య: 18
- స్పెషలిస్ట్ గ్రేడ్-3 పోస్టుల సంఖ్య: 122
- ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 94
- అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్ పోస్టుల సంఖ్య: 02
- అసిస్టింట్ ఇంజినీర్ పోస్టుల సంఖ్య: 05
- సైంటిస్ట్-బి పోస్టుల సంఖ్య: 06
- డిప్యూటీ డైరెక్టర్ పోస్టుల సంఖ్య: 02
- అసిస్టెంట్ కంట్రోలర్ పోస్టుల సంఖ్య: 05
- స్పెషలిస్ట్ గ్రేడ్-3 (రేడియో డయాగ్నోసిస్) పోస్టుల సంఖ్య: 21
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీటెక్, ఎల్ఎల్‌బీలో ఉత్తీర్ణతతో పాటు, నోటిపికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.25 చెల్లించాలి. మిగతా కేటగిరీలకు ఎలాంటి ఫీజు లేదు. ఇంటర్వ్యూ, విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.