NDA And NA Exam: నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ, నావెల్ అకాడెమీ ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఇలా అప్లై చేసుకోండి.

NDA And NA Exam 2021: నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), నావెల్ అకాడ‌మీల్లో (ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామ్‌(2)) ప్ర‌వేశాల‌కు యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇంట‌ర్మీడియ‌ట్...

NDA And NA Exam: నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ, నావెల్ అకాడెమీ ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఇలా అప్లై చేసుకోండి.

NDA And NA Exam 2021: నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), నావెల్ అకాడ‌మీల్లో (ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామ్‌(2)) ప్ర‌వేశాల‌కు యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇంట‌ర్మీడియ‌ట్ అర్హ‌తతో కేంద్ర ర‌క్ష‌ణ శాఖ‌లో చేరే అవ‌కాశ‌మున్న ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

మొత్తం ఖాళీలు, అర్హ‌త‌..

* మొత్తం 400 ఖాళీల‌కు భ‌ర్తీ చేయ‌డానికి ఈ నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఇందులో నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ(ఎన్‌డీఏ), నావెల్‌ అకాడెమీల్లో ప్ర‌వేశాలు చేప‌ట్ట‌నున్నారు.

* వీటిలో.. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ(ఎన్‌డీఏ): 370(ఆర్మీ 208, నేవీ 42, ఎయిర్‌ఫోర్స్‌ 120), నేవల్‌ అకాడెమీ(ఎన్‌ఏ): 30(10+2 కేడెట్‌ ఎంట్రీ స్కీమ్‌) ఖాళీలున్నాయి.

* ఆర్మీ విభాగం పోస్టులకు ఇంటర్మీడియెట్‌/10+2 ఉత్తీర్ణత ఉండాలి. ఎయిర్‌ఫోర్స్, నేవల్‌ వింగ్స్‌ పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌/10+2 ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్మీడియెట్ చివరి ఏడాది చ‌దువుతోన్న‌ విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.

ముఖ్య‌మైన విష‌యాలు..

* పైన తెలిపిన పోస్టుల‌కు అప్లై చేసుకునే వారు.. 2003 జనవరి 2 నుంచి 2006 జనవరి 1వ తేదీ మధ్య జన్మించి ఉండాలి.

* అభ్య‌ర్థుల‌ను రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వూ, మెడికల్‌ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు 29-06-2021 చివ‌రి తేదీ కాగా.. 05-09-2021న ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Body Sensor: ఇంటి నుంచి డాక్టర్ కు పేషెంట్ పరిస్థితిపై సమాచారం ఇచ్చే బాడీ సెన్సార్..కరోనా పేషెంట్స్ కోసమే!

Tata  Digital  Acquire 1MG: మొన్న క్యూర్ ఫిట్‌.. నేడు 1 ఎంజీ.. దూకుడు మీదున్న టాటా డిజిట‌ల్‌..

Happiness for sale: నవ్వుకోవాలంటే నాలుగు కాసులు పోయాల్సిందే..మార్కెట్లో ఆనందం కొనుక్కుంటున్నారోచ్..