NEERI Recruitment: నేషనల్‌ ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. మ‌రో రెండు రోజులే..

NEERI Recruitment 2021: న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్ - నేష‌న‌ల్ ఇన్విరాన్‌మెంటల్ ఇంజీనిరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నీరీ)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఇందులో భాగంగా మొత్తం 16 పోస్టుల‌ను...

NEERI Recruitment: నేషనల్‌ ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. మ‌రో రెండు రోజులే..
Neeri Delhi Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 11, 2021 | 9:49 PM

NEERI Recruitment 2021: న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్ – నేష‌న‌ల్ ఇన్విరాన్‌మెంటల్ ఇంజీనిరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నీరీ)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఇందులో భాగంగా మొత్తం 16 పోస్టుల‌ను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీ ఆదివారం (జున్ 13)తో ముగియ‌నున్న నేపథ్యంలో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* మొత్తం 16 పోస్టుల్లో భాగంగా ప్రాజెక్ట్‌ సైంటిస్ట్ (02), ప్రాజెక్ట్‌ అసోసియేట్ (09), సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్ (04), ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ (01) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ప్రాజెక్ట్‌ సైంటిస్ట్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/సైన్స్‌లో డాక్టోరల్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత విభాగంలో ప‌ని అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి. అభ్య‌ర్థుల వ‌య‌సు 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

* ప్రాజెక్ట్‌ అసోసియేట్ ఖాళీల‌కు అప్లై చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌యుసు 35ఏళ్లు మించకూడదు.

* సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ /డాక్టోరల్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం త‌ప్ప‌నిస‌రి. అభ్య‌ర్థుల వ‌య‌సు 40 ఏళ్లు మించ‌కూడ‌దు.

* ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ పోస్టుకు అప్లై చేసుకునే వారు.. మూడేళ్ల డిప్లొమా/ఇంజనీరింగ్‌/టెక్నాలజీలో బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం త‌ప్ప‌నిస‌రి. అభ్య‌ర్థుల వ‌య‌సు 50 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్టింగ్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ/టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు త‌మ పూర్తి వివ‌రాల‌ను neeridelhi@gmail.com ఐడీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 13.06.2021 చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: WFH Survey: వర్క్ ఫ్రం హోంపై ఉద్యోగుల మనోగతం.. 85శాతం మంది అభిప్రాయం అదే

DRDO Recruitment 2021: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా మూడు రోజులు అవకాశం

Facebook : ఫేస్ బుక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేసే వీలు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే