Happiness for sale: నవ్వుకోవాలంటే నాలుగు కాసులు పోయాల్సిందే..మార్కెట్లో ఆనందం కొనుక్కుంటున్నారోచ్..
Happiness for sale: నవ్వడం ఒక యోగం అన్నారు. ఒక చిన్న నవ్వుతో సమస్యల నుంచి వచ్చే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు అంటారు. సహజంగా వచ్చే నవ్వు మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది.
Happiness for sale: నవ్వడం ఒక యోగం అన్నారు. ఒక చిన్న నవ్వుతో సమస్యల నుంచి వచ్చే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు అంటారు. సహజంగా వచ్చే నవ్వు మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఇంట్లో నలుగురం కూచుని మాట్లాడుకునేప్పుడు వచ్చే సంఘటనలు కావచ్చు.. బయట స్నేహితులతో గడుపుతున్నపుడు వచ్చే చమత్కారం వల్ల కావచ్చు.. ఎన్నో రకాలుగా సహజంగా నవ్వుకోవడం మనిషికి మాత్రమె చేతనైనది. మనిషి మాత్రమె చేయగలిగినది. కానీ..ఇప్పుడు నవ్వు సహజత్వాన్ని కోల్పోయింది. డబ్బులు లేదా కాలాన్ని వెచ్చించి నవ్వు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. సరదాగా నవ్వుకోవాలంటే.. టీవీలో వచ్చే వెకిలి కామెడీ షోల బాట పట్టాల్సిన దుస్థితి. అంతేకాదు ఇప్పుడు నవ్వులను కొనుక్కోవడం కూడా మొదలైంది. దీనిని హ్యాపీనెస్ పరిశ్రమగా చెబుతున్నారు. దీని విలువ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2.4 ట్రిలియన్ డాలర్లట. అంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆనందాన్ని కొనుక్కోవడానికి పెడుతున్న ఖర్చు అన్నమాట. ఇది చెప్పాకా మీకో అనుమానం రావచ్చు నవ్వు అమ్మకానికి ఎక్కడెక్కడ దొరుకుతుందీ అని.. ఇవిగో ఆ వివరాలు..
- పిల్లలకు ఆన్ లైన్, ఆఫ్ లైన్లో యోగాతో పాటు నవ్వుల పాఠాలు చెపుతున్న యోగా సెంటర్లు.
- డబ్బులు వసూలు చేసి మరీ నవ్విస్తున్న లాఫ్టర్ థెరపీ సెంటర్లు. ఇంకా నవ్వుల పువ్వులు పూయిస్తామంటూ కామెడీ షోలు.. (టీవీ లలోనే కాకుండా ఇటీవలి కాలంలో బయట కూడా ఈ లాఫింగ్ ఈవెంట్లు ఏర్పాటు చేస్తున్నారు).
- ఇలా దేశంలో హ్యాపీనెస్ (ఆనందాన్ని) కొనుక్కోవాల్సిన పరిస్థితి.
కరోనా దోచేసింది..
అవును.. మన నవ్వుల్నీ కరోనా దోచేసింది. దానికంటే బాగా చెప్పాలంటే చిదిమేసింది. దీంతో దేశంలో చాలా మందిలో నవ్వు అనేది దూరం అయిపొయింది. నవ్వుతూ ఆనందంతో ఉంటే కరోనాపై విజయం సాధించవచ్చంటున్నారు పరిశీలకులు. కానీ నవ్వలంటే ముందు మన ప్రజల పరిస్థితి బాగోవాలి కదా! 2021 ప్రపంచ హ్యాపినెస్ నివేదిక ప్రకారం ప్రపంచంలోని 149 దేశాల్లో జరిపిన పరిశీలనలో హ్యపీన్స్ విషయంలో భారత్ స్థానం 139. లీస్ట్ పదిలో ఉన్నామన్న మాట. ఆరు అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ సూచీ తయారు చేశారు.
1. ప్రజల కొనుగోలు శక్తి, 2. సామాజిక మద్దతు, 3. ఆయుర్ధాయం 4. జీవితంలో నిర్ణయం తీసుకునే హక్కు 5. స్వేచ్చ, ఉదారత 6. దేశంలో ఉన్న అవినీతి. వీటిని లేక్కలేస్తే మన దేశం అంత అట్టడుగున ఉంది. విచిత్రం ఏమిటో తెలుసా.. మన పొరుగుదేశం పాకిస్తాన్ ర్యాంక్ 105 అంటే మనకంటె ఎంతో టాప్ లో ఉంది. ప్చ్ ఏం చేస్తాం. ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ నివేదిక వెల్లడించారు.
ఈ సంవత్సరమూ హ్యపీనెస్ దేశాల్లో అగ్రస్థానాన్ని ఫిన్లాండ్ కైవసం చేసుకుంది. అన్నట్టు ఈ సూచీ ప్రారంభించింది ఎప్పుడో తెలుసా? 2013లో ఆ సంవత్సరం మన ర్యాంక్ 111. అంతే ఈ నాలుగేళ్ళలోనూ 38 స్థానాలు దిగజారిపోయింది మన దేశపు ఆనందం. దీంతో ఇప్పటికే హ్యాపినెస్ పరిశ్రమ మన దేశంలో ఊపిరి పోసుకుంది. ప్రపంచంలో ఈ పరిశ్రమ విలువ. 4.2 ట్రిలియన్ డాలర్లు (రూ.315 లక్షల కోట్లు). గత మూడేళ్లలో 34 లక్షల మంది నవ్వడం, ఆనందంగా ఉండటానికి ‘కోర్సెరా’ ఫ్లాట్ ఫాం వేదికగా కోర్సులు అభ్యాసం చేస్తూ వస్తున్నారు. జీవితంలో ఆనందంగా ఎలా ఉండాలో నేర్చుకోవడానికి ఈ కోర్సు అభ్యసిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 15 కోట్లకంటే ఎక్కువ పోస్టులుయాష్ ట్యాగ్ హ్యాపినెస్ తో సందేశాలు ఉంటున్నాయి. ఆనందం అనేది జీవితంలో ఒక భాగం ఒక ఉత్పత్తిగా మార్కెట్ ద్వారా ప్రజల ముందుకు వచ్చిన దుస్థితి. రెండు దశాబ్దాలకు పూర్వం నవ్వు, ఆనందాన్ని కొనుక్కోవాల్సి వస్తుందని కలలో కూడా ఊహించని ప్రజలు
గత ఏడాది నుంచి ప్రజలు నవ్వు, ఆనందాన్ని మరిచిపోయేలా చేసిన కరోనా. నవ్వు, ఆనందంపై అమెరికాలోని లోమా లిండా యూనివర్సిటీ అధ్యయనం చేస్తోంది. 60 ఏళ్లుపైబడ్డ వారు నవ్వుతో వారిలో జ్ఞాపక శక్తిని పెంచుకుంటున్నారని వెల్లదించింది ఈ సంస్థ. నవ్వు ఒక వైరస్ కంటే ఎన్నో రెట్లు అధికంగా అంటు వ్యాధిలా వ్యాపిస్తుందని ఈ అధ్యయనం చెబుతోంది. ఎండీ లింక్స్ అధ్యయనం ప్రకారం.. నవ్వుతో సదరు వ్యక్తుల్లో నెగటివ్ వైఖరులు దూరమై పాజిటివ్ వైఖరులు పెరుగుతాయని వెల్లడి. ప్రపంచంలో 200కు పైగా యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆనందం అనే అంశంపై విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ జాబితాలో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం ప్రపంచ ప్రసిద్ధి గాంచింది.
గత నాలుగేళ్లుగా అగ్ర స్థానంలో ఫిన్లాండ్ ఎందుకంటే.. ఫిన్లాండ్ లో సంపూర్ణ అక్ష్యరాస్యత ఉంది. అక్కడ నేరాలు నేరాలు తక్కువ. లింగ వివక్షత శూన్యం, మహిళలకు నిర్ణయాధికారం ఎక్కువ. ఆర్థికంగా వెనకబడ్డవారికి ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు ఎక్కువే. ఉచిత విద్యాబ్యాసం, ఉచిత వైద్యం తదితర సౌకర్యాలు ఆ దేశంలో అమలవుతున్నాయి.