EPFO Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్‌వోలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలివే..
నిరుద్యోగులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) లో అకౌంట్ ఆఫీసర్ సహా పలు ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
నిరుద్యోగులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) లో అకౌంట్ ఆఫీసర్ సహా పలు ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 577 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు యూపీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ లో వెల్లడించింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ (ఈవో), అకౌంట్స్ ఆఫీసర్ (ఏవో) తో పాటు అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) ఉద్యోగాలను యూపీఎస్పీ భర్తీ చేయనుంది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ నాలుగైదు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. పరీక్ష తేదీతో పాటు మిగతా అన్ని వివరాలను మరికొద్ది రోజుల్లో upsc.gov.in / upsconline.nic.in ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనిద్వారా ఈ ఉద్యోగాల గురించి మరింత స్పష్టత రానుంది. UPSC ఈ ఖాళీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది.
నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు..
- మొత్తం ఉద్యోగాలు: 577. వీటిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ (ఈవో)/అకౌంట్స్ ఆఫీసర్(ఏవో) ఉద్యోగాలు 418, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు 159 ఉన్నాయి.
- దరఖాస్తులు ప్రారంభం – ముగింపు తేదీ: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి 25న మధ్యాహ్నం 12గంటల నుంచి ప్రారంభం కానుంది. మార్చి 17న సాయంత్రం 6గంటలతో ముగియనుంది.
- విద్యార్హత/వయో పరిమితి: ఏదైనా డిగ్రీ ఉండాలి. ఈవో/ఏవో ఉద్యోగాలకు 18 నుంచి 30 ఏళ్లు. ఏపీఎఫ్‌సీ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్ల వరకు వయో పరిమితి విధించారు.
- పరీక్ష రుసుం: జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.25. ఎస్సీ/ఎస్టీ/పీబ్ల్యూడీ/మహిళలకు ఫీజు లేదు. ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉంటుంది.
UPSC EPFO ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేయాలి..
- ఈ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి, ముందుగా అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.inకి వెళ్లాలి.
- వెబ్‌సైట్ హోమ్ పేజీలో కెరీర్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ప్రారంభమైన తర్వాత, UPSC EPFO రిక్రూట్‌మెంట్ 2023 లింక్ పై క్లిక్ చేయాలి.
- తదుపరి పేజీలో కోరిన వివరాలను పూరించడం ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ తర్వాత, అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు.
- అప్లికేషన్ సమర్పించిన తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం..