UPSC ESE 2025 Exam: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ‘ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2025’ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ కింద దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులకు తుది గడువు అక్టోబర్‌ 8వ తేదీతో ముగుస్తుంది. ఈసారి మొత్తం..

UPSC ESE 2025 Exam: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే
UPSC ESE 2025 Exam
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 19, 2024 | 6:08 AM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ‘ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2025’ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ కింద దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులకు తుది గడువు అక్టోబర్‌ 8వ తేదీతో ముగుస్తుంది. ఈసారి మొత్తం 232 పోస్టులు భర్తీ చేయనున్నారు. సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.

యూపీఎస్సీ- ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌-2025కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు..పోస్టును అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిప్లొమా, బీఈ/ బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) ఇన్‌స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణత లేదంటే ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్‌షిప్ ఎగ్జామినేషన్ పార్ట్స్ 2, 3/ సెక్షన్లు ఎ, బి అర్హత సాధించాలి. లేదా ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ ఇన్‌స్టిట్యూషన్ (ఇండియా) గ్రాడ్యుయేట్ సభ్యత్వ పరీక్ష పాసై ఉండాలి. లేదా వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ ఎలక్ట్రానిక్స్‌, రేడియో ఫిజిక్స్‌, రేడియో ఇంజినీరింగ్‌ విభాగంలో ఎంఎస్సీలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు వయసు జనవరి 1, 2025 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.200 చెల్లించాలి. మహిళా/ ఎస్సీ /ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే.. స్టేజ్‌-1 (ప్రిలిమినరీ/ స్టేజ్‌-1) ఎగ్జామ్‌, స్టేజ్‌-2 (మెయిన్‌/ స్టేజ్‌-2) ఎగ్జామ్‌, స్టేజ్‌-3 (పర్సనాలిటీ టెస్ట్‌), మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది. ప్రిలిమినరీ/ స్టేజ్-I పరీక్షలో రెండు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్న పత్రాలు ఇస్తారు. మొత్తం 500 మార్కులకు పేపర్ I నుంచి 200 మార్కులు, పేపర్ II నుంచి 300 మార్కుల చొప్పున వస్తాయి. మెయిన్ (స్టేజ్-II) ఇంజినీరింగ్ విభాగంలో రెండు పేపర్లు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒక్కో పేపర్‌కు 300 మార్కులు కేటాయిస్తారు. ప్రిలిమినరీ/ స్టేజ్-1 పరీక్ష తేదీ ఫిబ్రవరి 09, 2025న ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.