UOH Recruitment: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో వెబ్‌ డెవలపర్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

UOH Recruitment: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. యూవిర్సిటీలోని కంప్యూటర్ సెంటర్ అండ్‌ క్యాంపస్ నెట్‌వర్క్ ఫెసిలిటీ విభాగంలో ఉన్న ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు...

UOH Recruitment: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో వెబ్‌ డెవలపర్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
University Of Hyderabad
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 18, 2022 | 7:23 PM

UOH Recruitment: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. యూవిర్సిటీలోని కంప్యూటర్ సెంటర్ అండ్‌ క్యాంపస్ నెట్‌వర్క్ ఫెసిలిటీ విభాగంలో ఉన్న ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగానే పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా వెబ్ డెవలపర్, ప్రాజెక్ట్ అసోసియేట్ (01), వెబ్‌సైట్ కమ్ డేటా ఎంట్రీ అసిస్టెంట్ (01) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థులకు ఎంఎస్‌ ఆఫీస్‌, వర్డ్‌ ప్రెస్‌, జావాస్క్రిప్ట్‌, హెచ్‌టీఎంఎల్‌5 వాటిలో నైపుణ్యం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను ఆఫ్‌లైన్‌ విధానంలో పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను డైరెక్టర్ (సీసీ, సీఎన్‌ఎఫ్‌), సైన్స్ కాంప్లెక్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్‌ అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను తొలుత పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 01-07-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..