UGC NET 2024 Exam Date: యూజీసీ- నెట్ (జూన్) 2024 పరీక్ష తేదీ వచ్చేసిందోచ్.. ఓఎమ్మార్ పద్ధతిలోనే పరీక్ష
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రతీయేట నెట్ పరీక్షలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా యూజీసీ నెట్ జూన్ 2024 (UGC NET June 2024) పరీక్ష తేదీని నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రకటించింది. ఈ పరీక్షను జూన్ 18న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్షకు 10 రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. మొత్తం 83 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు..
హైదరాబాద్, జూన్ 2: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రతీయేట నెట్ పరీక్షలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా యూజీసీ నెట్ జూన్ 2024 (UGC NET June 2024) పరీక్ష తేదీని నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రకటించింది. ఈ పరీక్షను జూన్ 18న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్షకు 10 రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. మొత్తం 83 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఓఎమ్మార్ ఆధారిత పరీక్ష (పెన్/ పేపర్)ను ఆఫ్‌లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా ఒకే రోజు నిర్వహించనున్నారు. రెండు షిఫ్టుల్లో పరీక్ష ఉంటుంది. 42 సబ్జెక్టులకు ఉదయం సెషన్‌లో పరీక్ష ఉంటుంది. మిగిలిన 41 సబ్జెక్టులకు మధ్యాహ్నం సెషన్‌లో పరీక్ష ఉంటుంది. ఉదయం సెషన్ 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. కాగా ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.
ఓఎమ్మార్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష మొత్తం 3 గంటల వ్యవధి ఉంటుంది. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉండదు. జూనియర్ రిసెర్చి ఫెలోషిప్ అవార్డు, యూనిరర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు యూజీసీ నెట్ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది.
యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ ఐసెట్ 2024 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 5, 6వ తేదీల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేసినట్లు టీఎస్ ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ నరసింహాచారి ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షను కాకతీయ యూనివర్సిటీ (కేయూ) నిర్వహిస్తోంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.