TS Group1 Primary Key: తెలంగాణ గ్రూప్‌1-2022 ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రైమరీ ఆన్సర్‌ ‘కీ’ శనివారం (అక్టోబర్‌ 29) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది. 503 గ్రూప్‌ 1 పోస్టులకు అక్టోబర్‌ 16న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన..

TS Group1 Primary Key: తెలంగాణ గ్రూప్‌1-2022 ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
TSPSC Group-1 Prelims Answer Key 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 30, 2022 | 7:57 AM

తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రైమరీ ఆన్సర్‌ ‘కీ’ శనివారం (అక్టోబర్‌ 29) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది. 503 గ్రూప్‌ 1 పోస్టులకు అక్టోబర్‌ 16న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన కీ తో పాటు, 2,85,916 మంది అభ్యర్థులు డిజిజల్ ఓఎంఆర్ షీట్‌లను సైతం కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేసి ఓఎంఆర్‌ జవాబు పత్రాలను నవంబరు 29 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇక కీపై అభ్యంతరాలు లేవనెత్తడానికి అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 4 వరకు అవకాశం ఇచ్చింది. ఐతే ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే అభ్యర్ధులు అభ్యంతరాలను నమోదు చేయవల్సి ఉంటుంది. ఈమెయిల్స్ లేదా ఇతర రాతపూర్వక మార్గాల్లో అభ్యంతరాలను సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోమని కమిషన్‌ స్పష్టం చేసింది. అభ్యర్థులు అభ్యంతరాలతో పాటు సరైన సమాధానానికి సంబంధించిన రుజువులు లేదా రిసోర్సు కాపీలను పీడీఎఫ్‌ రూపంలో సమర్పించాలని పేర్కొంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రైమరీ అన్సర్‌ కీతోపాటు అభ్యర్ధుల సౌకర్యార్ధం వివిధ సిరీస్‌లలో ఇచ్చిన ప్రశ్నాపత్రాలను ఏక రూప ప్రశ్నాపత్రంగా రూపొందించి కమిషన్‌ తన వెబ్‌సైట్‌లో ఉంచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.