TSPSC: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. కొత్తగా మరో రెండు నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వరుస నోటిఫికేషన్‌లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్స్‌ మొదలు ప్రభుత్వ విభాగాల్లో ఉన్న పలు ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ వచ్చిన టీఎస్‌పీఎస్సీ తాజాగా మరో రెండు కొత్త నోటిఫికేషన్లు విడుదల..

TSPSC: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. కొత్తగా మరో రెండు నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ.
TSPSC
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 29, 2022 | 8:32 AM

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వరుస నోటిఫికేషన్‌లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్స్‌ మొదలు ప్రభుత్వ విభాగాల్లో ఉన్న పలు ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ వచ్చిన టీఎస్‌పీఎస్సీ తాజాగా మరో రెండు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి ద్వారా మొత్తం 276 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చే నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇంతకీ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

రెండు నోటిఫికేషన్స్‌లో భాగంగా విద్యా శాఖ, వ్యవసాయ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెక్నికల్​ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్‌లో 37 పీడీ పోస్టులు, ఇంటర్మీడియట్‌​ డిపార్ట్​మెంట్‌‌లో 91 పీడీ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వచ్చేనెల 6వ తేదీని నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక మరో నోటిఫికేషన్‌లో భాగంగా వ్యవసాయ శాఖలో అగ్రిల్చర్​ ఆఫీసర్​ పోస్టులను భర్తీ చేయనున్నారు. మల్టీజోన్​ –1 లో 100, మల్టీజోన్​ –2లో 48 ఖాళీలు ఉన్నాయి. వచ్చేనెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటికి సంబంధించిన వివరాలన్నీ టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ సెక్రెటరీ అనితా రామచంద్రన్​ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?