SBI Recruitment: చివరి అవకాశం.. ఎస్‌బీఐ పోస్టుల దరఖాస్తుకు నేటితో ముగియనున్న గడువు.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ముంబయిలోని కార్పొరేట్‌ సెంటర్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెక్నీకల్‌ డిగ్రీ పూర్తి చేసి వారు ఈ పోస్టులకు అర్హులు. ఇక ఈ ఖాళీలను ఎస్‌బీఐ రెగ్యులర్‌/కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేయనున్నారు...

SBI Recruitment: చివరి అవకాశం.. ఎస్‌బీఐ పోస్టుల దరఖాస్తుకు నేటితో ముగియనున్న గడువు.
Sbi Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 29, 2022 | 9:58 AM

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ముంబయిలోని కార్పొరేట్‌ సెంటర్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెక్నీకల్‌ డిగ్రీ పూర్తి చేసి వారు ఈ పోస్టులకు అర్హులు. ఇక ఈ ఖాళీలను ఎస్‌బీఐ రెగ్యులర్‌/కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. ఇదలా ఉంటే దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నేటితో (29-12-2022)తో ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంంటుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో డిప్యూటీ మేనేజర్(డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్) (06), డిప్యూటీ మేనేజర్(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్) (02), డిప్యూటీ మేనేజర్(జావా డెవలపర్) (05), డిప్యూటీ మేనేజర్(డబ్ల్యూఏఎస్‌ అడ్మినిస్ట్రేటర్) (03), సీనియర్ ఎగ్జిక్యూటివ్(ఫ్రంటెండ్ యాంగ్యులర్ డెవలపర్) (03), సీనియర్ ఎగ్జిక్యూటివ్(పీఎల్‌ & ఎస్‌క్యూఎల్‌ డెవలపర్) (03), సీనియర్ ఎగ్జిక్యూటివ్(జావా డెవలపర్) (10), సీనియర్ ఎగ్జిక్యూటివ్(టెక్నికల్ సపోర్ట్) (01), ఎగ్జిక్యూటివ్(టెక్నికల్ సపోర్ట్) (02), సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ (టెక్నాలజీ ఆర్కిటెక్ట్) (01) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్‌(కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్) లేదా ఎంసీఏ/ ఎంఈ, ఎంటెక్‌/ ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 31-07-2022 నాన్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 32 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 35 సంవత్సరాలు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* డీఎం పోస్టులను ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మిగిలిన పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, సీటీసీ నెగోషియేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులు ముంబయిలో పనిచేయాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ నేటితో (29-12-2022)తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..