TSPSC Paper leak case: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్‌.. ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లో మరో 3 ప్రశ్నపత్రాలు

తాజాగా ప్రవీణ్‌ దగ్గర ఉన్న పెన్‌ డ్రైవ్‌లో ఏఈ ప్రశ్నపత్రంతో పాటు మరో మూడు ప్రశ్నాపత్రాలు కూడా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు..

TSPSC Paper leak case: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్‌.. ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లో మరో 3 ప్రశ్నపత్రాలు
TSPSC Paper leak case
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 16, 2023 | 8:22 PM

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బుధవారం (మార్చి 15) ఏఈ పరీక్ష రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఏఈ ప్రశ్నపత్రం లీకైందని గుర్తించడంతో టీఎస్‌పీఎస్సీ అధికారులు మార్చి 5న జరిగిన అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. తాజాగా ప్రవీణ్‌ దగ్గర ఉన్న పెన్‌ డ్రైవ్‌లో ఏఈ ప్రశ్నపత్రంతో పాటు మరో మూడు ప్రశ్నాపత్రాలు కూడా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రవీణ్‌ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌, పెన్‌డ్రైవ్‌లను సిట్‌ అధికారులు స్వాధీనం చేసుకుని ఎఫ్ఎస్‌ఎల్‌ అధికారులకు పంపించారు. వీటిల్లో టౌన్‌ప్లానింగ్‌, వెటర్నరీ అసిస్టెంట్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఐతే దీనిపై టీఎస్‌పీఎస్సీ అధికారులు కానీ, సిట్‌ అధికారులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. నిజానిజాలు నిర్ధారణ కాకుండా ఎలాంటి వివరాలు వెల్లడించినా నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొనే అవకాశం ఉందని, అందువల్లనే సమాచారం వెల్లడించడం సాధ్యం కాదని సిట్‌ అధికారులు చెబుతున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను విచారించిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.