TSPSC Group-4: తెలంగాణ గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌లో ఉద్యోగాల సంఖ్య తగ్గించడం వెనుక అసలు కారణం ఇదే..

తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ తాజాగా 8,039 పోస్టులకు గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే గతంలో 9,168 పోస్టులకు ప్రకటన ఇస్తామన్న సర్కార్‌ ఉన్నట్లుండి దాదాపు 1208 పోస్టులను తొలగించడం తెనుక ప్రస్తుతం చర్చ..

TSPSC Group-4: తెలంగాణ గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌లో ఉద్యోగాల సంఖ్య తగ్గించడం వెనుక అసలు కారణం ఇదే..
TSPSC Group 4
Follow us

|

Updated on: Jan 01, 2023 | 9:45 PM

తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ తాజాగా 8,039 పోస్టులకు గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే గతంలో 9,168 పోస్టులకు ప్రకటన ఇస్తామన్న సర్కార్‌ ఉన్నట్లుండి దాదాపు 1208 పోస్టులను తొలగించడం తెనుక ప్రస్తుతం చర్చ సాగుతోంది. తొలగించిన పోస్టులన్నీ కూడా పంచాయతీరాజ్‌శాఖ సంబంధించినవే కావడం విశేషం.

పంచాయతీరాజ్‌శాఖకు క్షేత్రస్థాయిలో జిల్లాల నుంచి సరైన సమాచారం రాకపోవడం, సాంకేతిక సమస్యల కారణంగా ఈ పోస్టులను పక్కన పెట్టేసిందట. దీంతో గ్రూప్‌-4 ఉద్యోగ నోటిఫికేషన్‌ నుంచి దాదాపు 1,208 ఉద్యోగాలను తొలగించి కేవలం 8,039 పోస్టులకే ప్రకటన విడుదల చేసింది. ఈ కారణంగా గ్రూప్‌-4 ప్రకటన ఆలస్యమైతే ఉద్యోగార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని గ్రహించిన టీఎస్పీయస్సీ మిగిలిన పోస్టులకు మాత్రమే ప్రకటన వెలువరించింది. ఇక మొత్తం పోస్టుల్లో రెవెన్యూశాఖలో 19 పోస్టులు పెరగడంతో ఈ శాఖ పరిధిలో ఉద్యోగాల సంఖ్య 2,096కి చేరాయి. మహిళా శిశు సంక్షేమశాఖలో కూడా పోస్టులు 77కి చేరాయి.

మొత్తం 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాలను దాదాపు 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో భర్తీ చేస్తామని తొలుత కమిషన్‌ తెలిపింది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్‌శాఖలో 1,245 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కమిషన్‌ ప్రభుత్వానికి సమాచారమిచ్చింది. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ ఆయా విభాగాలతో సమావేశమై గడువులోగా ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించింది. ప్రతిపాదనలు ఆలస్యమైతే ఆ పోస్టులను తప్పిస్తామని ముందుగానే హెచ్చరించింది కూడా. అయినా గ్రూప్‌ 4 ఉద్యోగాల ప్రకటన నాటికి పంచాయతీరాజ్‌ శాఖ నుంచి తగిన వివరాలు రాకపోవడంతో చేసేదిలేక ఆ శాఖ పరిధిలోని పోస్టులను పక్కన పెట్టేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.