TS Constable Results 2023: వెబ్‌సైట్లో తెలంగాణ కానిస్టేబుళ్ల తుది ఎంపిక జాబితా.. ఆ పోస్టుల ఫలితాలు ఇప్పట్లోలేనట్లే!

తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ తుది ఫలితాలు బుధవారం (అక్టోబర్‌ 4) విడుదల చేయగా అందుకు సంబంధించిన కటాఫ్‌, వ్యక్తిగత మార్కుల వివరాలు ఈ రోజు (అక్టోబర్‌ 5) ఉదయం పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడినట్లైంది. సుదీర్ఘ కసరత్తు అనంతరం పోలీస్‌, ఎస్పీఎఫ్‌, అగ్నిమాపక, జైళ్లు, రవాణా, ఆబ్కారీ శాఖలకు సంబంధించి మొత్తం 16,604 పోస్టులకు ఈ నియామక..

TS Constable Results 2023: వెబ్‌సైట్లో తెలంగాణ కానిస్టేబుళ్ల తుది ఎంపిక జాబితా.. ఆ పోస్టుల ఫలితాలు ఇప్పట్లోలేనట్లే!
TS Constable Results 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 05, 2023 | 3:57 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 5: తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ తుది ఫలితాలు బుధవారం (అక్టోబర్‌ 4) విడుదల చేయగా అందుకు సంబంధించిన కటాఫ్‌, వ్యక్తిగత మార్కుల వివరాలు ఈ రోజు (అక్టోబర్‌ 5) ఉదయం పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడినట్లైంది. సుదీర్ఘ కసరత్తు అనంతరం పోలీస్‌, ఎస్పీఎఫ్‌, అగ్నిమాపక, జైళ్లు, రవాణా, ఆబ్కారీ శాఖలకు సంబంధించి మొత్తం 16,604 పోస్టులకు ఈ నియామక ప్రక్రియ చేపట్టగా 15,750 పోస్టులకు సంబంధించిన ఫలితాలను పోలీస్‌ నియామక మండలి వెలువరించింది. వీరిలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికైనట్లు ప్రకటించింది.

అర్హులు లేకపోవడంతో మిగిలిన 854 పోస్టులను బ్యాక్‌లాగ్‌లో పరిగణించనున్నట్లు ఈ సందర్భంగా నియామక మండలి తెల్పింది. అయితే పోలీస్‌ రవాణా సంస్థలో 100 డ్రైవర్‌ పోస్టులు, అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను మాత్రం తర్వాత వెల్లడిస్తామని, దీనిపై న్యాయ వివాదం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అందుకే ఈ 325 పోస్టుల ఫలితాలను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు తెల్పింది. కాగా కానిస్టేబుల్‌ కొలువులకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన వివరాలను, కటాఫ్‌ మార్కులను అక్టోబర్‌ 5వ తేదీ ఉదయం ప్రకటిస్తామని చెప్పిన నియామక మండలి అక్టోబ‌రు 4న‌ రాత్రేకే వెల్లడించింది. ఫలితాలతోపాటు కటాఫ్‌ మార్కుల వివరాలు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ 2023 తుది ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ 2023 క‌టాఫ్‌ వివ‌రాల కోసం క్లిక్ చేయండి.

ఈ నెల 12, 13 తేదీల్లో అటెస్టేషన్‌ పత్రాల సమర్పణ

తుది జాబితాలో చోటు దక్కిన అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లలో అక్టోబ‌రు 7-10 తేదీల మధ్య అటెస్టేషన్‌ పత్రాలు అందుబాటులో ఉంటాయి. వాటిని ఆన్‌లైన్‌లో పూరించిన తర్వాత డౌన్‌లోడ్‌ చేసి, పాస్‌పోర్టు సైజ్‌ ఫోటోలను అతికించి, మూడు సెట్లపై గెజిటెడ్‌ అధికారి సంతకాలు చేయించుకుని అక్టోబ‌రు 12, 13 తేదీల్లో సంబంధిత కార్యాలయాల్లో సమర్పించాలని బోర్డు ఈ సందర్భంగా అభ్యర్ధులకు సూచించింది. సివిల్‌, ఏఆర్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులు తమ జిల్లా ఎస్పీ కార్యాలయం లేదా కమిషనరేట్లలో అటెస్టేషన్‌ పత్రాలను సమర్పించాలి. ఎస్పీఎఫ్‌, ఎస్‌ఏఆర్‌-సీపీఎల్‌, రవాణా కానిస్టేబుల్‌ (Main Office) అభ్యర్థులు హైదరాబాద్‌ గోషామహల్‌ స్టేడియంలో సమర్పించాల్సి ఉంటుంది. టీఎస్‌ఎస్‌పీ, ఐటీ అండ్‌ కమ్యూనికేషన్‌, ఫైర్‌మెన్‌, ఎక్సైజ్‌, వార్డర్లు, రవాణా కానిస్టేబుల్‌ (LC) అభ్యర్థులు సంబంధిత జిల్లా పోలీస్‌ లేదా కమిషనరేట్‌ ఆఫీస్‌లలో సమర్పించాలని సూచించింది.

అక్టోబ‌రు 5 నుంచి 7వ తేదీ వరకు అభ్యంతరాల నివృత్తికి అవకాశం

తుది ఎంపిక ప్రక్రియపై అభ్యంతరాల నివృత్తికి అక్టోబ‌రు 5న ఉదయం 8 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లోని వ్యక్తిగత లాగిన్‌ ఐడీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని నియమక మండలి వివరించింది. ఇందుకోసం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.1000, ఇతరులు రూ.2000 రుసుంగా చెల్లించాల్సి ఉంటుందని తెల్పింది. దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్‌లైన్‌లోనే సమాధానాలు త్వరలో అందుబాటులోకి తెస్తామని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఈ మేరకు సూచించింది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.