DOST Admissions 2023: తెలంగాణ విద్యార్ధులకు అలర్ట్.. దోస్త్‌ ప్రవేశాల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. మొత్తం మూడు విడతల్లో డిగ్రీ..

DOST Admissions 2023: తెలంగాణ విద్యార్ధులకు అలర్ట్.. దోస్త్‌ ప్రవేశాల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు!
DOST 2023 Admissions
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 23, 2023 | 12:12 PM

హైదరాబాద్‌, జులై 23: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. మొత్తం మూడు విడతల్లో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతోంది. ఐతే తాజా దోస్త్‌ ప్రవేశాలకు సంబంధించి ఆయా తేదీల్లో స్వల్ప మార్పులు జరిగినట్లు కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. గత ఏకధాటి కురుస్తోన్న వర్షాల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా గడువు తేదీలను పెంచుతున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం మూడో విడత ప్రవేశాల ప్రక్రియ జరుగుతోంది. మూడో విడతలో సీట్లు పొందిన విద్యార్ధులు జులై 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయవచ్చని తెలిపారు. అలాగే అన్ని విడతల్లో సీట్లు సాధించిన విద్యార్థులు జులై 26వ తేదీలోపు ఆయా కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయడానికి గడువు ఇచ్చారు. ఈ విద్యాసంవత్సరానికి జులై 26వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రవేశాలు పొందిన వారు ఒక బ్రాంచి నుంచి మరో బ్రాంచిలోకి మారేందుకు జులై 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఇంట్రా కాలేజ్‌ ప్రక్రియ జరుగుతుంది. వీరందరికీ ఆగస్టు 1న సీట్లు కేటాయిస్తామని దోస్త్‌ కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.