Fall Session 2022: ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకున్నారా? ఏడాదికి రూ.7 లక్షల చొప్పున వరుసగా 4 ఏళ్లపాటు..
అమెరికాకు చెందిన ట్రూమన్ స్టేట్ యూనివర్సిటీ ఫాల్ సెమిస్టర్ సెషన్ (September to December) -2022కు గాను ఇండియన్ విద్యార్థులకు రాష్ట్రపతి గౌరవ స్కాలర్‌షిప్ (President’s Honorary scholarship) అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది..
Truman State University Scholarship for Indian students: అమెరికాకు చెందిన ట్రూమన్ స్టేట్ యూనివర్సిటీ ఫాల్ సెమిస్టర్ సెషన్ (September to December) -2022కు గాను ఇండియన్ విద్యార్థులకు రాష్ట్రపతి గౌరవ స్కాలర్‌షిప్ (President’s Honorary scholarship) అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతిభావంతులైన ఇండియన్ స్టూడెంట్స్‌కు రూ.7,51,000 (US$ 10,000)ల వరకు స్కాలర్‌షిప్ అందించబడుతుంది. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ https://international.truman.edu/southasia/లో ఈ ఏడాది ఏప్రిల్ 30 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బిజినెస్, హెల్త్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, ఆర్ట్ అండ్ లెటర్స్, సోషల్ అండ్ కల్చరల్ స్టడీస్.. ఈ 5 ప్రోగ్రాముల్లో ఏదైనా ఒకటి చదివే విద్యార్ధులు అర్హులు. ఒక్క సారి ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైతే వరుసగా 8 సెమిస్టర్ల (4 ఏళ్ల)పాటు రెన్యువల్ అవుతుంది. ఐతే ప్రతి సెమిస్టర్‌లోనూ తప్పనిసరిగా 3.25 గ్రేడ్ పాయింట్లు మెయింటెన్ చెయ్యవల్సి ఉంటుంది.
అర్హతలు:
- ఒక ఎస్సేతోపాటు, 3.5 జీపీఏ, 1300 SAT, IELTS 7.0 ఉండాలి. లేదా తత్సమాన అర్హత కలిగి విద్యార్ధులకు US$ 10,000 (రూ.7,51,000)ల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
- 3.25 జీపీఏ, 1240 SAT, IELTS 7.0 లేదా తత్సమాన అర్హత కలిగిన విద్యార్ధులకు US$ 7,500 (రూ. 5,65,000)ల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
- 3.0 జీపీఏ, 1160 SAT, IELTS 6.5 లేదా తత్సమాన అర్హత కలిగిన విద్యార్ధులకు US$ 5,000 (రూ.3,77,000)ల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
Also Read: