KVS Admission 2022-23: కేంద్రీయ విద్యాలయలో 1వ తరగతి 2022 ప్రవేశాలు ప్రారంభం.. ఫలితాలెప్పుడంటే..
కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) 2022-23 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఈ రోజు (ఫిబ్రవరి 28) ఉదయం 10 గంటల నుంచి..
KVS Admission 2022 Notification: కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) 2022-23 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఈ రోజు (ఫిబ్రవరి 28) ఉదయం 10 గంటల నుంచి ప్రారంభిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో తెల్పింది. తల్లిదండ్రులకు సంబంధించిన మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, ప్రవేశం కోరుతున్న పిల్లల ఫొటో, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, సీడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్‌తోపాటు ఇతర సంబంధిత ఆధారాలను అప్లికేషన్‌లో నమోదు చేయవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థుల తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్ kvsonlineadmission.kvs.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించబడింది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ మార్చి 21గా తెల్పింది. ఇక ప్రవేశాలకు సంబంధించి సీట్ల కేటాయింపు ఫలితాలు (first provisional list) మార్చి 25న విడుదలౌతుంది. సీట్ల లభ్యత ఆధారంగా తదుపరి జాబితాలు ఏప్రిల్ 1, ఏప్రిల్ 8న విడుదలౌతాయి. 1వ తరగతిలో ప్రవేశాలు కోరే విద్యార్ధులకు మార్చి 31 నాటికి తప్పనిసరిగా 5 సంవత్సరాలు నిండి ఉండాలి. (ఏప్రిల్ 1వ తేదీన జన్మించినవారు కూడా అర్హులే). కేవీఎప్ అడ్మిషన్ల 2022-23కు సంబంధించిన ఇతర వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడొచ్చు.
కేవీఎస్ 2022 అడ్మిషన్లకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇవే..
- 1వ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 28, 2022.
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: మార్చి 21, 2022.
- సీటు అలాట్ మెంట్ ఫలితాలు విడుదల: మార్చి 25, 2022.
- సీటు అలాట్ మెంట్ సెకండ్ రౌండ్ ఫలితాలు విడుదల: ఏప్రిల్ 1, 2022.
- సీటు అలాట్ మెంట్ థార్డ్ రౌండ్ ఫలితాలు విడుదల: ఏప్రిల్ 8, 2022.
Also Read: