Fake Universities: దేశంలో 20 ఫేక్ యూనివ‌ర్శిటీలు.. ఆంధ్రప్రదేశ్‌లో 2.. ప్రకటించిన యూజీసీ.. పూర్తి జాబితా ఇదిగో..

Fake Universities: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) బుధవారం 20 యూనివర్సిటీలను నకిలీవని ప్రకటించింది. దీంతో ఈ యూనివర్శిటీలు ఎలాంటి డిగ్రీని ప్రదానం చేసే హక్కు లేదు. ఢిల్లీలో అత్యధికంగా ఎనిమిది ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. గుర్తింపు లేని మోసపూరిత సంస్థల నుంచి విద్యను పొందే ఉచ్చులో పడకుండా విద్యార్థులను రక్షించడమే UGC చర్యగా ముందడుగు వేసింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆయా యూనివర్శిటీల్లో నమోదు చేసుకునే ముందు అనుబంధాన్ని చెక్ చేసుకోవాలని సూచించింది.

Fake Universities: దేశంలో 20 ఫేక్ యూనివ‌ర్శిటీలు.. ఆంధ్రప్రదేశ్‌లో 2.. ప్రకటించిన యూజీసీ.. పూర్తి జాబితా ఇదిగో..
Fake Universities

Updated on: Aug 03, 2023 | 5:45 AM

Fake Universities: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) బుధవారం 20 యూనివర్సిటీలను నకిలీవని ప్రకటించింది. దీంతో ఈ యూనివర్శిటీలు ఎలాంటి డిగ్రీని ప్రదానం చేసే హక్కు లేదు. ఢిల్లీలో అత్యధికంగా ఎనిమిది ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. గుర్తింపు లేని మోసపూరిత సంస్థల నుంచి విద్యను పొందే ఉచ్చులో పడకుండా విద్యార్థులను రక్షించడమే UGC చర్యగా ముందడుగు వేసింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆయా యూనివర్శిటీల్లో నమోదు చేసుకునే ముందు అనుబంధాన్ని చెక్ చేసుకోవాలని సూచించింది.

యూజీసీ సెక్రటరీ మనీష్ జోషి మాట్లాడుతూ.. యూజీసీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా పలు సంస్థలు పట్టాలు ప్రదానం చేస్తున్నట్టు కమిషన్ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి విశ్వవిద్యాలయాలు అందించే డిగ్రీ ఉన్నత విద్య లేదా ఉద్యోగ ప్రయోజనాల కోసం గుర్తించబడవు లేదా చెల్లుబాటు కావు. ఇవి యూనివర్శిటీలు కావని, ఏదైనా డిగ్రీ ప్రదానం చేసే హక్కు తమకు మాత్రమే ఉందన్నారు.

ఈ నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను విడుదల చేసిన ఆయన.. ఢిల్లీలో ఎనిమిది, ఉత్తరప్రదేశ్‌లో నాలుగు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున ఇలాంటి సంస్థలు ఉన్నాయని తెలిపారు. దీంతో పాటు కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి నుంచి ఒక్కో యూనివర్సిటీని ఇందులో చేర్చారు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో 8 ఫేక్ యూనివర్శిటీలు..

1. ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం

2. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్

3. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్

4. విశ్వకర్మ ఓపెన్ యూనివర్శిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్

5. ఏడీఆర్-సెంట్రిక్ జురిడికల్ యూనివర్శిటీ

6. కమర్షియల్ యూనివర్శిటీ లిమిటెడ్, దర్యాగంజ్

7. ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయం

8. వొకేషనల్ యూనివర్సిటీ

ఉత్తరప్రదేశ్..

1. గాంధీ హిందీ విద్యాపీఠ్

2. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి

3. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్శిటీ

4. భారతీయ శిక్షా పరిషత్ ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్..

1. గుంటూరులోని కాకుమానువారి తోటలో క్రైస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివర్శిటీ

2. విశాఖలోని బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియా.

మరిన్ని కెరీర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..