UPSC Civils Mains Schedule 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ టైం టేబుల్ విడుదల.. రోజుకు 2 సెషన్లలో పరీక్షలు
వివిధ కేంద్ర సర్వీసుల్లో నియామకాలకు నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ)- 2023 సంబంధించి మెయిన్స్ పరీక్ష తేదీలకు సంబంధించిన టైం టేబుల్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున..

ఢిల్లీ, ఆగస్టు 2: వివిధ కేంద్ర సర్వీసుల్లో నియామకాలకు నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ)- 2023 సంబంధించి మెయిన్స్ పరీక్ష తేదీలకు సంబంధించిన టైం టేబుల్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున మెయిన్స్ నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అంటే ఒక్కో సెషన్ మూడు గంటల పాటు పరీక్ష జరుగుతుంది. మెయిన్స్ పరీక్షలు మొత్తం ఐదు రోజుల పాటు కొనసాగుతాయి.
కాగా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ రాత పరీక్ష మే 28న నిర్వహించగా.. జూన్ 12న ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది అఖిల భారత సర్వీసులకు మొత్తం 1105 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో కమిషన్ పేర్కొంది. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ తర్వాత మెయిన్స్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. ప్రతీ యేట సివిల్ సర్వీసులకు యూసీఎస్సీ నియామక ప్రక్రియ చేపడుతోంది. యేటా దేశ వ్యాప్తంగా లక్షలాది యువత ఈ పరీక్షలకు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ టైం టేబుల్ 2023 కోసం క్లిక్ చేయండి.




మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.