AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 3 Top Ranker: గ్రూప్‌ 3లో మెరిసిన మెదక్‌ బిడ్డ అర్జున్‌రెడ్డి.. సొంత ప్రిపరేషన్‌తో టాప్‌ ర్యాంక్‌

శుక్రవారం విడుదలైన తెలంగాణ గ్రూప్ 3 ఫలితాల్లో మెదక్‌ జిల్లా పాపన్నపేటకు చెందిన కుకునూరి అర్జున్‌రెడ్డి 339.239 మార్కులతో గ్రూప్‌ 3 టాపర్‌గా నిలిచాడు. అంతేకాకుండా మొన్న విడుదలైన గ్రూప్‌ 2లోనూ 18వ ర్యాంకు కొట్టాడు. ఓ వైపు మెదక్‌ కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తూనే సొంతంగా పరీక్షలకు సన్నద్ధమై..

TGPSC Group 3 Top Ranker: గ్రూప్‌ 3లో మెరిసిన మెదక్‌ బిడ్డ అర్జున్‌రెడ్డి.. సొంత ప్రిపరేషన్‌తో టాప్‌ ర్యాంక్‌
TGPSC Group 3 Top Ranker
Srilakshmi C
|

Updated on: Mar 16, 2025 | 3:18 PM

Share

మెదక్ మార్చి 16: తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో మెదక్‌ జిల్లా పాపన్నపేటకు చెందిన కుకునూరి అర్జున్‌రెడ్డి 339.239 మార్కులతో గ్రూప్‌ 3 టాపర్‌గా నిలిచాడు. అంతేకాకుండా తాజాగా విడుదలైన గ్రూప్ 2 లోనూ 413 మార్కులు సాధించి రాష్ట్ర 18వ ర్యాంకు సాధించాడు. ఈసీఈ విభాగంలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన అర్జున్ రెడ్డి.. 2014లో వీఆర్వోగా ఎంపికై.. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం మెదక్‌ కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే సొంతంగా పరీక్షలకు సన్నద్ధమైన అర్జున్ రెడ్డి గ్రూప్స్‌ పరీక్షల్లో వరుసగా ర్యాంకులు కొట్టి అందరినీ అబ్బురపరిచాడు.

మెదక్‌ గ్రంథాలయాన్నే శిక్షణ కేంద్రంగా మలుచుకుని, పోటీ పరీక్షల్లో విజేతగా నిలిచిన అర్జున్‌ రెడ్డి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. అర్జున్‌ రెడ్డి గ్రూప్‌ 2 పోస్టుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపాడు. కాగా అర్జున్‌రెడ్డి తండ్రి నరేందర్‌రెడ్డి మెదక్‌ లైబ్రరీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి శోభ గృహిణి. తమ్ముడు అరుణ్‌రెడ్డి మెదక్‌లో ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు.

కాగా మొత్తం 1388 గ్రూప్‌ 3 పోస్టులకు ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 5,36,400 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,67,921 మంది మూడు పేపర్లకు హాజరయ్యారు. వీరిలో 18,364 మందిని ఇన్‌వ్యాలీడ్‌గా టీజీపీఎస్సీ ప్రకటించింది. మిగతా 2,49,557 మంది జనరల్‌ ర్యాంకింగ్‌ వివరాలను కమిషన్‌ తాజాగా విడుదల చేసింది. తాజా పలితాల్లో పరీక్ష రాసిన అభ్యర్థుల మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్‌తోపాటు ఓఎంఆర్‌ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వీటిని ఏప్రిల్‌ 12 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏవైనా సమస్యలుంటే పనివేళల్లో ఫోన్‌ 040-23542185, 23542187 నంబర్లను సంప్రదించాలని సూచించారు. జనరల్‌ ర్యాంకింగ్స్‌ నుంచి అభ్యర్థులను ఎంపిక చేసి ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు. అనంతరం తుది ఎంపిక జాబితా విడుదల చేస్తారని కమిషన్‌ కార్యదర్శి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..