TGPSC Group 1 Hall Tickets: టీఎస్పీయస్సీ గ్రూప్ 1 అభ్యర్ధులకు అలర్ట్.. మరో 2 రోజుల్లో ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టులకు జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. గ్రూప్ 1 హాల్ టికెట్లు జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచున్నట్ల ఆయన తెలిపారు...

హైదరాబాద్, మే 30: తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టులకు జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. గ్రూప్ 1 హాల్ టికెట్లు జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచున్నట్ల ఆయన తెలిపారు. పరీక్ష రోజున ఉదయం 9 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తామని, పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే సంబంధిత పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత గేట్లు మూసివేస్తామని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోమని ఆయన వెల్లడించారు.
పరీక్ష సమయంలో బయోమెట్రిక్ తప్పనిసరిగా ఇవ్వాలని, బయోమెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయబోమని ఆయన స్పష్టంచేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చెప్పులు మాత్రమే వాడాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ బూట్లు ధరించకూడదు. బయోమెట్రిక్‌ను పరీక్ష కేంద్రంలో ఉదయం 9.30 నుంచే ప్రారంభిస్తారు. పరీక్ష మొదలైన తర్వాత ప్రతి అరగంటకు ఒకసారి బెల్ మోగించి పరీక్ష సమయాన్ని తెలియజేస్తామని, అలాగే అభ్యర్థులు ఇన్విజిలేటర్‌ను అడిగి కూడా సమయం తెలుసుకోవచ్చని ఆయన అన్నారు. అభ్యర్థుల పేరు, రిజిస్ట్రేషన్ నంబర్ వంటి ఇతర వ్యక్తిగత సమాచారం ముద్రించిన ఓఎంఆర్ షీట్లు అందజేస్తారు. ఓంఎఆర్, క్వశ్చన్ పేపర్‌లో సూచించిన నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఇప్పటికే నమూనా ఓఎంఆర్ షీట్‌ను టీఎస్పీయస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. పరీక్ష ముగిసేవరకు అభ్యర్ధులు పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళ్లరాదని, పరీక్ష ముగిశాక ఓఎంఆర్ పత్రాన్ని తప్పనిసరిగా ఇన్విజిలేటర్‌కు అందజేయాలని ఆయన సూచించారు.
కాగా టీఎస్పీయస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రిలిమ్స్ అనంతరం మెయిన్ పరీక్షలు అక్టోబరు 21 నుంచి ప్రారంభమవుతాయి. మెయిన్ పరీక్షలు మొత్తం 7 పేపర్లకు జరుగుతాయి. ప్రిలిమినరీ పరీక్షలో 1:50 నిష్పత్తిలో అర్హత సాధించిన వారిని మెయన్ పరీక్షకు అనుమతిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




