AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ గ్రూప్‌ 1 పోస్టులు అమ్మకానికి పెట్టినట్టు తప్పుడు ప్రచారం.. TGPSC మాస్‌ వార్నింగ్

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 పోస్టులకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో షేక్‌ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీటిపై స్పందించిన టీజీపీఎస్సీ ఆ వార్తలను ఖండించింది. అసత్య ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తామంటూ వార్నింగ్‌ చేసింది..

తెలంగాణ గ్రూప్‌ 1 పోస్టులు అమ్మకానికి పెట్టినట్టు తప్పుడు ప్రచారం.. TGPSC మాస్‌ వార్నింగ్
పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకొని రా వద్దని విద్యాశాఖ సూచించింద. విద్యార్థులు హాల్ టికెట్ పెన్, పెన్సిల్, పాడ్, ఎరేజర్, జమిట్రిక్ పరికరాలు మాత్రమే తీసుకొని రావాలి. పరీక్ష ప్రశ్నాపత్రం ఇచ్చిన వెంటనే ప్రతి పేపర్ పై విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. కానీ ఆన్సర్ షీట్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ షీట్ పై మాత్రం ఎలాంటి నెంబర్లు పేరు వివరాలు సంకేతాలు లాంటివి రాయొద్దని విద్యాశాఖ సూచించింది. పరీక్షా సమయం పూర్తయ్యే వరకు ఎగ్జామ్ హాల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
Srilakshmi C
|

Updated on: Mar 06, 2025 | 2:13 PM

Share

హైదరాబాద్‌, మార్చి 6: తెలంగాణ పబ్లిక్‌ కమీషన్‌ (టీజీపీఎస్సీ) మొత్తం 563 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి సంబంధించి గతేడాది గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు అక్టోబర్‌ 21వ తేదీ నుంచి అక్టోబర్‌ 27వ తేదీ వరకు మొత్తం 7 పేపర్లకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 31,383 మంది క్వాలిఫై అవగా కేవలం 21,093 మంది అభ్యర్ధులు మాత్రమే హాజరయ్యారు. అంటే 67.17 శాతం మాత్రమే పరీక్ష రాశారన్నమాట. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీపడుతున్నారు. మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్‌ ఫలితాల వెల్లడికి ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తుంది. అయితే తాజాగా గ్రూప్‌ 1 ఉద్యోగాలపై కొందరు వ్యక్తులు తప్పుడు వార్తలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా వీటిపై స్పందించిన టీజీపీఎస్సీ ఆ వార్తలను ఖండించింది.

సోషల్‌ మీడియాలో జరుగుతోన్న అసత్య ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరువునష్టం దావా వేస్తామంటూ కమిషన్‌ ప్రకటించింది. అతి త్వరలోనే గ్రూప్‌ 1 ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. మార్కుల జాబితాను వెబ్‌సైట్‌లో పెడతామని.. అభ్యర్థుల లాగిన్‌లో పేపర్ల వారీగా మార్కులు చేసుకోవచ్చని పేర్కొంది. అంతేకాకుండా గ్రూప్‌ 1 నియామక ప్రక్రియ పారదర్శకంగానే జరుగుతోందని, ఎలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకున్నామనీ పేర్కొంది. సోషల్‌ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాలను అభ్యర్థులు నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.

అసలేం జరిగిదంటే..

టీజీపీఎస్సీ గ్రూప్‌ -1 పోస్టుల అమ్మకమంటూ సోషల్‌మీడియాలో గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరగడంతో టీజీపీఎస్సీ స్పందించింది. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై మార్చి 5 బేగంబజార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అలాగే సైబర్‌ క్రైమ్స్‌ డీసీపీకి సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. గ్రూప్‌ 1 ఆశావాహుల్లో అపోహలు, గందరగోళం సృష్టించేందుకు నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్‌ పరువునష్టం దావా వేసినట్టు కమిషన్‌ ఇన్‌చార్జి కార్యదర్శి సుమతి తెలిపారు. గ్రూప్‌1 ఫలితాలను పారదర్శకంగా ప్రాసెస్‌ చేస్తున్నామని, ఏ అభ్యర్థికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.