TGCET 2024 Notification: తెలంగాణ గురుకులాల్లో అయిదో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎల్‌, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, టీఆర్‌ఈఐఎస్‌ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ అయిదో తరగతి ఇంగ్లిషు మీడియంలో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీగా జనవరి 6ను నిర్ణయించారు. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.100లు చెల్లించవల్సి ఉంటుంది..

TGCET 2024 Notification: తెలంగాణ గురుకులాల్లో అయిదో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల
TGCET 2024
Follow us

|

Updated on: Dec 17, 2023 | 10:01 PM

తెలంగాణలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎల్‌, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, టీఆర్‌ఈఐఎస్‌ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ అయిదో తరగతి ఇంగ్లిషు మీడియంలో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీగా జనవరి 6ను నిర్ణయించారు. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.100లు చెల్లించవల్సి ఉంటుంది. తెలంగాణ గురుకులాల్లో అయిదో తరగతి ప్రవేశ పరీక్ష-2024, రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. సంబంధిత జిల్లాల్లోని ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి 2023-24 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. విద్యార్ధుల వయసుకు సంబంధించి ఓసీ, బీసీ, బీసీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.1.50,000, పట్టణ ప్రాంతంలో రూ.2,00,000 మించకుండా ఉండాలి.

ప్రవేశ పరీక్ష విధానం..

తెలంగాణ గురుకులాల్లో అయిదో తరగతి ప్రవేశ పరీక్ష-2024 ఆబ్జెక్టివ్ పద్ధతిలో జరుగుతుంది. ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో 10 ప్రశ్నలకు100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. తెలుగుకు 20 మార్కులు, ఇంగ్లిష్ 25 మార్కులు, గణితం 25 మార్కులు, మెంటల్‌ ఎబిలిటీ 10 మార్కులు, పరిసరాల విజ్ఞానం 20 మార్కులు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలు ఇవే…

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: డిసెంబర్‌ 18, 2023.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 6, 2024.
  • ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 11, 2024.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో