TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాలు వచ్చేశాయ్. ఎలా చెక్ చేసుకోవాలంటే..
Telangana TET 2022 Results: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. నిజానికి ఫలితాలు ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా...
TS TET 2022 Results: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. నిజానికి ఫలితాలు ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇంటర్, టెన్త్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో అధికారులు టెట్ ఫలితాలను కూడా విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
పేపర్1కు మొత్తం 318444 మంది హాజరుకాగా 104078 మంది ఉత్తీర్ణత సాధించారు (32.68 శాతం). పేపర్ 2 విషయానికొస్తే 250897 మంది హాజరుకాగా 124535 మంది ఉత్తీర్ణులయ్యారు (49.64 శాతం). చాలా ఏళ్ల తర్వాత తెలంగాణలో జూన్ 12న టెట్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో పేపర్-1కు 3,18,506, పేపర్-2కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు టెట్ ను నిర్వహించారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..