Attention! తెలంగాణ టెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. ఈసారి టెట్‌లో కీలకమార్పులివే!

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ నోటిఫికేషన్ ఈ రోజు (మార్చి 24)  రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం..

Attention! తెలంగాణ టెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. ఈసారి టెట్‌లో కీలకమార్పులివే!
Ts Tet 2022 Notification
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 24, 2022 | 6:54 PM

Telangana TET 2022 Notification: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ నోటిఫికేషన్ ఈ రోజు (మార్చి 24)  రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక టెట్‌ పరీక్షను జూన్‌ 12న నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ తెల్పింది. పాఠశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 13,086 పోస్టుల్లో 10,000లవరకు టీచర్‌ పోస్టులు (TS Teacher Job Vacancies)న్నాయి. వీటిల్లో 6,700ల వరకు ఎస్జీటీ ఉపాధ్యాయ కొలువులు (ఆదర్శ పాఠశాలల్లోని ఖాళీలను కూడా కలుపుకుంటే 11,000ల వరకు ఉండొచ్చిని అంచనా) ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే టీచర్‌ నియామకాలకు ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రత్యేక తెలంగాణలో టెట్‌ నిర్వహించడం ఇది మూడోసారి.

గతంలో 2016 మే, 2017 జులైలో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది టెట్‌లో బీఈడీ అభ్యర్ధులకు మరో సదావకాశాన్ని కల్పిస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అందేంటంటే.. ఇప్పటివరకు బీఈడీ అభ్యర్థులు 6 – 10 తరగతులు బోధించేందుకు మాత్రమే అర్హులు. అందుకు టెట్‌లో పేపర్‌-2 రాసేవారు. ఇక నుంచి వారు 1 – 5 తరగతులకు బోధించేందుకు ఎస్జీటీలుగా నియమితులు కావొచ్చు. అంటే వారు టెట్‌లో పేపర్‌ 1 రాయవచ్చు. కాకపోతే ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ప్రాథమిక విద్య బోధనలో 6 నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. ఇప్పటివరకు పేపర్‌-1కు కేవలం డీఈడీ వారు మాత్రమే అర్హులుగా ఉండేవారు. అంతేకాదు.. ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే ఆ ధ్రువపత్రానికి ఇప్పటివరకు 7 ఏళ్ల కాలపరిమితి ఉండేది. గడువు ముగిశాక మళ్లీ టెట్‌ రాసుకోవాల్సిందే. ఐతే అందుకు భిన్నంగా ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే జీవితాంతం విలువ ఉండేలా మార్పు చేయాలని ఎన్‌సీటీఈ రెండేళ్ల క్రితమే నిర్ణయించింది.

Also Read:

Inspirational Story: పేదింటి చదువుల సరస్వతికి రూ.14 లక్షల ప్యాకేజీతో అమెజాన్‌ ఉద్యోగం..